కాంగ్రెస్‌కు డిపాజిట్‌ గల్లంతే


Wed,May 15, 2019 03:17 AM

-ఎన్నికలంటేనే కాంగ్రెస్‌కు వణుకు
-ప్రజల గుండెల్లో టీఆర్‌ఎస్‌
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
n- ఎమ్మెల్సీ స్థానానికి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు
వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తేతెలంగాణ: ఎన్నికలు అంటేనే కాంగ్రెస్‌కు వణుకుపుడుతోందని, టీఆర్‌ఎస్‌ ప్రజల గుండెల్లో నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్‌ చైర్మన్‌లతో కలిసి మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. మంగళవారం పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రజల గుండెల్లో నిలిచిందని, ఎన్నికలు ఏవైనా గెలుపు గులాబీ జెండాదేనన్నారు. ఓటమి భయంతో రాష్ట్రంలో ప్రతీ ఎన్నికలను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ న్యాయస్థానాలను ఆశ్రయిస్తుందని విమర్శించారు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నిలుపాలని సీఎం కేసీఆర్‌ కృషి చేస్తుంటే కాంగ్రెస్‌ నాయకులు రాజకీయాల కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ అభివృద్ధి నిరోధకులుగా తయారయ్యారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీలో మొదటి నుంచి కష్టపడ్డ నాయకుడు, సీఎం కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని వరంగల్‌ ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులందరూ పార్టీలకు అతీతంగా ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి, బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...