రెండో విడతకు రెడీ


Fri,April 26, 2019 01:39 AM

- మూడు మండలాల్లో ఎన్నికలు
- 3 జెడ్పీటీసీ, 34 ఎంపీటీసీ స్థానాలు
- ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ
- మూడు రోజుల అవకాశం
- ముగిసిన మొదటి విడత నామినేషన్ల పరిశీలన
- 4 జెడ్పీటీసీలకు 44, 52 ఎంపీటీసీలకు 335 నామినేషన్లు
- 28 వరకు తొలివిడత ఉపసంహరణకు అవకాశం

హసన్‌పర్తి, ఏప్రిల్ 22: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ఘట్టం బుధవారం ముగిసింది. దీంతో గురువారం అధికారులు నామినేషన్ పత్రాల పరిశీలన చేపట్టారు. సరైన వివరాలు లేని పత్రాలను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. హసన్‌పర్తి మండలంలో ఎంపీటీసీ కోసం 60 మంది, జెడ్పీటీసీ కోసం ఆరుగురు నామినేషన్లు వేయగా.. ఏవీ తిరస్కరణకు గురికాలేదు. కమలాపూర్ మండలంలోనూ నామినేషన్లు తిరస్కరణ కాలేదు. ఎల్కతుర్తి మండలంలో ఒక అభ్యర్థికి చెందిన రెండు నామినేషన్ సెట్లను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు.

ఎంపీటీసీకి 60, జెడ్పీటీసీకి 6 నామినేషన్ పత్రాలు
మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో 9 ఎంపీటీసీ స్థానాలకు వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న నామినేషన్ పత్రాలను గురువారం ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా సహాయ ఎన్నికల అధికారి కక్కెర్ల వీరేశ్ పర్యవేక్షణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా 9 ఎంపీటీసీ స్థానాలకు 56 మంది 60 నామినేషన్ పత్రాలను సమర్పించగా నాలుగు డూప్లికేట్ సెట్లు వేసినట్లు తెలిపారు. అలాగే జెడ్పీటీసీ స్థానానికి ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించారని చెప్పారు. మల్లారెడ్డిపల్లి నుంచి ఆరుగురు 7 నామినేషన్లు వేయగా.. ఒకటి డూప్లికేట్ సెట్‌గా, అనంతసాగర్ నుంచి ఏడుగురు 9 నామినేషన్ పత్రాలు, 2 డూప్లికేట్ సెట్లు, నాగారం నుంచి ఐదుగురు ఆరు నామినేషన్ పత్రాలు, ఒకటి డూప్లికేట్ సెట్‌గా నిర్దారించారు. అలాగే సిద్దాపూర్ నుంచి నలుగురు 4 నామినేషన్ పత్రాలు, బైరాన్‌పల్లి నుంచి 9 మంది 9 సెట్లు, జయగిరి నుంచి ఐదుగురు 5 సెట్లు, మడిపల్లి నుంచి ముగ్గురు 3 సెట్లు, పెంబర్తి నుంచి ఆరుగురు 6 సెట్లు, సీతంపేట నుంచి 11 మంది 11 సెట్లు నామినేషన్ పత్రాలు సమర్పించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. నామినేషన్ల పరిశీలనలో ఎన్నికల అధికారులు విజయలక్ష్మి, రాజిరెడ్డి, దామోదర్‌రెడ్డి, కుమార్‌తో పాటు ఎన్నికల సిబ్బంది, ఈవోపీఆర్డీ వేణుగోపాల్‌రెడ్డి, సూపరింటెండెంట్ విజయ్‌కుమార్, కుమారస్వామి, సత్యానారాయణరెడ్డి, రమాకాంత్‌రెడ్డి, విక్రమ్, సురేశ్, ప్రణయ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

నామినేషన్ల పరిశీలన
కమలాపూర్: ఎంపీటీసీలు, జెడ్పీటీసీల మొదటి విడత నామినేషన్ల దాఖలు గడువు ముగియడంతో గరువారం మండల పరిషత్ కార్యాలయంలో అధికాలు పత్రాల పరిశీలించారు. మండలంలోని 18 ఎంపీటీసీ స్థానాలకు 165, జెడ్పీటీసీకి 12 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ల పరిశీలనలో ఒక్కటి కూడా తిరస్కరణకు గురికాలేదని పేర్కొన్నారు. నామినేషన్ల విత్ డ్రా కు ఈనెల 28వరకు గడువు ఉండటంతో నామినేషన్ వేసిన అభ్యర్థులతో మంతనాలు, బుజ్జగింపులు మొదలయ్యాయి. కమలాపూర్-1లో అధికంగా 19 నామినేషన్లు వేయగా శ్రీరాంలపల్లి, వెంకటేశ్వర్లపల్లి ఎంపీటీసీ స్థానాలకు అత్యల్పంగా 5 నామినేషన్లు వేశారు. అధికార పార్టీ టికెట్‌కు డిమాండ్ ఉండటంతో ఆశావహులు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒక్క అభ్యర్థివే రెండు సెట్ల నామినేషన్లు తిరస్కరణ
ఎల్కతుర్తి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా ఆయా స్థానాలకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లలో రెండు తిరస్కరణకు గురైనట్లు ఎంపీడీవో ఇందుమతి తెలిపారు. మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు 61 మంది 72 నామినేషన్లు వేశారు. ఇందులో పెంచికల్‌పేట నుంచి ఒక అభ్యర్థి దాఖలు చేసిన రెండు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. అలాగే జెడ్పీటీసీకి 9మంది 16 నామినేషన్లు వేయగా అందరి నామినేషన్లను అధికారులు ఆమోదించారు. కాగా ఎలాంటి సమస్యలున్నా అభ్యర్థులు శుక్రవారం అప్పీల్ చేసుకోవచ్చని ఎంపీడీవో తెలిపారు.

నేడు నోటిఫికేషన్
సుబేదారి, ఏప్రిల్ 25: పరిషత్ ఎన్నికల రెండో విడత నోటిఫికేషన్ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనున్నది. వరంగల్ అర్బన్ జిల్లాలో మొత్తం ఏడు గ్రామీణా మండలాలు ఉన్నాయి. వీటిలో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్, హసన్‌పర్తి మండలాలకు మొదటి విడత ఎన్నికల జరుగనున్న విషయం తెలిసిందే. ఈమండలాలకు ఈనెల 22నుంచి 24వరకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక రెండో విడతలో ఐనవోలు, వేలేరు, ధర్మసాగర్ మండలాలు ఉన్నాయి. ఈ మూడు మండలాలకు శుక్రవారం నోటిఫికేషన్ రానున్నది. 26నుంచి 28వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రెండో విడతలో మూడు జెడ్పీటీసీ, 34 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జిల్లాలో మొత్తం 7 జెడ్పీటీసీ స్థానాలు , 86 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. తొలివిడతలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలకు 44 నామినేషన్లు, 52 ఎంపీటీసీ స్థానాలకు 335 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక రెండో విడతలో మూడు జెడ్పీటీసీ, 34 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటికి నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ కానుంది. ఇందుకోసం ఎంపీడీవో కార్యాలయాల్లో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రెండో విడత నామినేషన్లు 28తో ముగుస్తుంది. 29 పరిశీలన, 2న ఉపసంహరణ, వచ్చే నెల 10వ తేదీన పోలింగ్ ఉంటుంది. మొదటి విడత స్థానాలకు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. అలాగే రెండో విడతలోనూ చాలామంది అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి ఉత్సాహంతో ఉన్నారు.

126
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...