మక్క రైతులకు ఊరట


Thu,April 25, 2019 03:24 AM

కాశీబుగ్గ, ఏప్రిల్ 24: ఆరుగాలం కష్టించి పండించిన మక్క రైతులకు కాస్త్త ఊరట కలిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే మద్దతు ధరను మించి పలుకుతుంది. దీంతో మక్క రైతుల కష్టానికి ఫలితం దక్కుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం సీజన్ ప్రారంభంతో పత్తి పంట చెడిపోగా రైతులు చాలా వరకు ఆర్థికంగా నష్టపోయారు. దీంతో ప్రారంభ ధశలోనే ఆ పంటను కాస్తా తొలగించి మక్కలను పండించారు. గత సంవత్సరం మద్దతు ధర రూ.1425 కాగా గరిష్టంగా క్వింటాల్‌కు రూ.1450 వరకు పలికినట్లు అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో గరిష్టంగా రూ.2200 ధరలు ఒక్క లాట్‌కు పలికింది. బుధవారం మార్కెట్‌లో మక్కలకు క్వింటాల్‌కు రూ.2121 ధర పలికింది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1700 ఉండగా మద్దతు ధరను మించి ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ధరలు మాత్రం నిలకడగానే ఉన్నట్లు అధికారులు చెప్పారు. గత సంవత్సరం మార్కెట్‌కు లక్షా 569 క్వింటాళ్ల మక్కలు రాగా ప్రైవేట్ వ్యాపారులు 66 వేల 444 క్వింటాళ్లు, మద్దతు ధరలతో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓడీసీఎంఎస్ 19 వేల 45 క్వింటాళ్లు, ఖిలా వరంగల్ పీఏసీఎస్ ద్వారా 15వేల 80 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు మార్కెట్‌కు 69 వేల 28 క్వింటాళ్లు రాగా ప్రైవేట్ వ్యాపారులు 49వేల 167 క్వింటాళ్లు ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్ ద్వారా 19వేల 861 క్వింటాళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా బుధవారం వరంగల్ మార్కెట్‌కు 98 క్వింటాళ్లు రాగా గరిష్టంగా రూ.2121, మధ్యరకం రూ.2051, రూ.1800పలికాయి.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...