భూ మాఫియాపై సీపీ కన్నెర్ర


Thu,April 25, 2019 03:24 AM

వరంగల్ క్రైం, ఏప్రిల్ 24 : కమిషనరేట్‌లో భూ మాఫియాను అంతమొందించి ప్రజల ఆస్తులకు పోలీస్ యంత్రాంగం కాపలాగా నిలిచేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ దృష్టి సారించారు. భూకబ్జాదారులను ప్రోత్సహిస్తూ నేరాలకు బాటలు వేసే పోలీస్ అధికారుల భరతం పట్టే పనిలో పోలీస్ బాస్ ఉన్నారు. బుధవారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో భూకబ్జాదారులకు సహకరించే పోలీస్ అధికారులకు సీపీ హెచ్చరికలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలో ఎక్కడైనా పోలీస్ అధికారులు భూకబ్జాదారులకు సహకరించినట్లె తెలిస్తే తక్షణమే వేటు వేయడం జరుగుతుందని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ల వారీగా అధికారుల పనితీరు, కేసుల నమోదు పరిష్కారం, ప్రస్తుత కేసుల స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు దారులపట్ల మర్యా దగా వ్యవహరిస్తూ, ఫిర్యాదుపై తీసుకున్న చర్యలను బాధితులకు తెలియపర్చాన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదైతే ఎఫ్‌ఐఆర్ కాఫీని ఫిర్యాదుదారుడికి అందజేయాలని ఆదేశించారు.

బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
విధులను నిజాయితీగా నిర్వర్తిస్తూ స్టేషన్ల పరిధిలో చోటు చేసుకుంటున్న సంఘటనలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకరావాలని సీపీ పేర్కొన్నారు. వర్టికల్స్ వారీగా నిర్వహించాల్సిన విధులపై సిబ్బందికి స్టేషన్ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ రోజు ఒక వర్టికల్‌పై సంబంధిత సిబ్బందితో సమీక్ష జరపాలన్నారు. నేరాల నియంత్రణ కోసం టీఎస్ కాప్‌తో పాటు సీ.సీ.టీ.ఎన్.ఎస్ ఆప్లికేషన్‌లోని అన్ని అంశాలపై సిబ్బంది నైపుణ్యం సాధిం చాలన్నారు. ప్రధానంగా స్టేషన్లలో విధులు నిర్వర్తించే సిబ్బంది కంప్యూటర్‌పై పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు. దర్యాప్తులో కీలకంగా నిలుస్తున్న సీసీ కెమెరాల ఏర్పాటుపై సంబంధిత స్టేషన్ అధికారులు మరింత శ్రద్ధ చూ పాలన్నారు. సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న గొడవలపై దృష్టిసారించి పరిష్కరించడంతో చొరవచూపాలన్నారు.

పరిషత్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
మే నెలలో నిర్వహించే జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు శాంతియుతమైన వాతావరణంలో జరిగేందుకు పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉండాని సీపీ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, డీజీపీ ఆదేశాలను పాటిస్తూనే సంబంధిత స్టేషన్ అధికారులు స్టేషన్ల పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రామ పోలీస్ అధికారులతో పాటు స్టేషన్ అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాలను సందర్శిస్తూ గ్రామస్తులతో సత్ససంబంధాలను కొనసాగించాలన్నారు. పోలీస్‌స్టేషన్ల వారీగా పెండింగ్ ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లలోని నిందితులను కోర్టులో హాజ రుపర్చాలన్నారు. సమావేశంలో డీసీపీలు నాగరాజు, శ్రీనివాస్‌రెడ్డి, నరసింహ, ఏసీపీలు సుధీంద్ర, సునితామోహన్, మధుసూదన్, వెంకటేశ్వర్లుబాబు, జనార్ధన్, శ్రీనివాసులు, నర్సింగ్‌రావు, నర్సయ్య, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...