షార్ట్ సర్క్యూట్‌తో హోటల్ దగ్ధం


Wed,April 24, 2019 03:25 AM

-విలువగల నిత్యావసర సరుకులు బుగ్గిపాలు అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
కాశీబుగ్గ, ఏప్రిల్23: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలోని ఓ హోటల్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో అగ్రిప్రమాదం జరిగిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మార్కెట్ ప్రధాన రెండోగేటు ఎదురుగా ఉ న్న సుధాకర్ హోటల్‌లో మంగళవారం రోజూలాగే టిఫిన్‌ను తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యు త్ వైర్ల నుంచి మిరుగులు వచ్చి పక్కనే పూరీలు ఉన్న వేడినీటి నూనెలో పడి పెద్ద ఎత్తున మంటలు వ్యా పించాయి. దీంతో ఒక్కసారిగా హోటల్‌లో పనిచేస్తున్న వర్కర్లు కేకలు వేస్తు బయటకు వచ్చారు. అలా గే, ఆ మంటలలో హోటల్‌లో నిల్వ చేసిన సుమారు లక్షకు పైగా విలువగల ని త్యావసర సరుకులు దగ్ధం అయ్యాయి. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి స మాచారం అందించగా వారు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. దీం తో పెను ప్రమాదం తప్పిందని పలువురు రైతులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం మార్కెట్‌కు వచ్చే రైతులు, కార్మికులు, అడ్తి వ్యాపారులతో హోటల్ కిటకిటలాడుతుంది. కాగా, అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మా ర్కెట్ పరిధిలో పనిచేసే వివిధ కార్మికులు, రైతులు, అడ్తి, ఖరీదు వ్యాపారులతో పాటు చుట్టు పక్కల ఎన్టీఆర్‌నగర్, సుందరయ్యనగర్, రెడ్డిపాలెం, బాలాజీనగర్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...