నాటక రంగానికి సీఎం కేసీఆర్ ప్రోత్సాహం


Tue,April 23, 2019 02:36 AM

న్యూశాయంపేట, ఏప్రిల్ 22: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అంతరిస్తున్న నాటక రంగాన్ని, కళాకారులను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు. సోమవారం హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాదవ్ కళా ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక, చలన చిత్రాభివృద్ధి సంస్థ సౌజన్యంతో వనం లక్ష్మీకాంతారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన పందిళ్ల శేఖర్ బాబు స్మారక నాటకోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు అని, సాహిత్య, కళారంగాల్లో జాతీయ ఉద్యమంలో తన పాత్రను సమర్ధవంతంగా పోషించారని కొనియాడారు. అంతరించి పోతున్న నాటక రంగాన్ని బతికించి భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. పందిళ్ల శేఖర్‌బాబు తన వృత్తిని సమర్ధవంతగా నిర్వహిస్తూనే ప్రవృత్తిపరంగా నాటక రంగానికి సేవ చేశారని చెప్పారు. పందిళ్ల శేఖర్‌బాబు స్మారక నాటక సప్తాహ కమిటీ సభ్యుడు పందిళ్ల అశోక్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నాటక రంగాన్ని బతికించడానికి రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ సంచాలకులు ఎంవీ రమణారావు నాటక సప్తాహం నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. వరంగల్ నుంచే సప్తాహ కార్యక్రమం ప్రారంభించారన్నారు. గత రెండేళ్ల నుంచి క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం అతిథులను ఘనం గా సన్మానించారు. సభ నిర్వాహణ అనంతరం గురుమిత్ర రేపల్లె వారు రైతే రాజు సాంఘిక నాటకం, తెలంగాణ డ్రమటిక్ అసోసియేషన్ వరంగల్ వారు శ్రీకృష్ణరాయబారం పౌరాణిక నాటకాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ దూరదర్శన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎంవీ. వరప్రసాద్ పురుషోత్తమరావు, ఆకుల సదానందం నిమ్మల శ్రీనివాస్, దామోదర్, రామశాస్త్రి పాల్గొన్నారు.

నేటి కార్యక్రమ వివరాలు
పందిళ్ల శేఖర్ బాబు స్మారక నాటకోత్సవాల్లో భాగాంగా మంగళవారం ముఖ్యఅతిథిగా రాజ్య సభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాదిమి శివకుమార్, సీఎం ఆఫీసు ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, సభాధ్యక్షులుగా రాష్ట్ర భాషాసంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, అతిథులుగా రాష్ట్ర నాటక సమాజాల అధ్యక్షులు తడకమళ్ల రామచందర్‌రావు, మహేందర్‌రెడ్డి హాజరవుతారని నిర్వాహకులు చెప్పారు. అనంతరం జీపీఎల్ మీడియా హైదరాబాద్ వారిచే బై వన్-గెటు టూ సందేశాత్మక సాంఘిక నాటకం ప్రదర్శిస్తారు. అనంతరం నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారిచే బాలనాగమ్మ జానపద పద్యనాటకం ప్రదర్శిస్తారు.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...