ఓరుగల్లు గడ్డ కళాకారులకు అడ్డా..


Mon,April 22, 2019 03:05 AM

-ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దిన వరంగల్
-కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి
-కేయూలో ముగిసిన ఓరుగల్లు నృత్యోత్సవం
-నాలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు
రెడ్డికాలనీ, ఏప్రిల్ 21: ఓరుగల్లు గడ్డ ఎందరో కళాకారులకు అడ్డా అని కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి అన్నారు. శ్రీకృష్ణ సంగీత నృత్య పాఠశాల వరంగల్ ఆధ్వర్యంలో కేయూ ఆడిటోరియంలో నిర్వహించిన రెండు రోజుల ఓరుగల్లు నృత్యోత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సుమారు 3 వేలకుపైగా నృత్య కళాకారులు పాల్గొని అన్నమయ్య సంకీర్తనాలకు నృత్యాలు నిర్వహించారు. 611వ అన్నమయ్య జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి నాలుగు రికార్డులు సొంతం చేసుకున్నట్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డు, ట్రెజర్ హంట్ రికార్డుల్లో నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు చింతపట్ల వెంకటాచారి, బొమ్మరెడ్డి శ్రీనివాసరెడ్డి, దొమ్మరాజు సురేఖ ప్రకటించారు. అనంతరం ఈ రికార్డు నమోదు పత్రాలను ముఖ్యఅతిథుల చేతుల మీదుగా నిర్వాహకులకు అందజేశారు. అనంతరం యాదవరెడ్డి మాట్లాడుతూ ఓరుగల్లు ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో సత్కారాలు పొందినవారికి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేయాలని, వారికి ప్రభుత్వం తరుఫున సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా నాట్య గురువులకు, నాట్య కళాకారులకు, నాట్యబ్రహ్మ, నాట్యశ్రీ అవార్డులు అందజేశారు. ప్రముఖ కూచిపూడి నృత్య గురువులు వేదాంతం రాధేశ్రీను, శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఆశీర్వచనలు అందించారు. ఉభయ తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాల నుంచి పెద్దసంఖ్యలో కళాకారులు పాల్గొని నృత్యప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో నాట్య గురువులు భ్రమరాంబ, జ్వాలాముఖి, టీవీ అశోక్‌కుమార్, మోహన్, మోటె చిరంజీవి, పద్మావతి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

171
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...