మామిడి రైతులకు మార్కెట్ కష్టాలు


Mon,April 22, 2019 03:04 AM

-ప్రకృతి శాపం, వ్యాపారులకు అవకాశం
-నిల్వ సౌకర్యం లేక వదిలి వెళ్లిపోతున్న రైతులు
-ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు
వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 21: మామిడి రైతులకు వరంగల్ పండ్ల మార్కెట్‌లో అమ్మకపు కష్టాలు తప్పడం లేదు. ప్రకృతి విలయానికి పంట నష్టపోయిన మామిడి రైతులకు నేల రాలిన కాయల అమ్మకాల్లో సైతం సరైన ధర దక్కకపోవడంతో మార్కెట్‌లోనే వదిలి కన్నీటితో వెనుదిరగాల్సిన దుస్థితి నెలకొంది. పంట దిగుబడి తగ్గినప్పటికీ ఆశలు వదులుకోని రైతులకు ప్రకృతి తీరని అన్యాయం చేస్తుంటే మార్కెట్‌లో వ్యాపారులు సైతం తమవంతుగా మామిడి రైతును ముంచుతున్నారు. అకాల వార్షానికి నేల రాలిన కాయలకు కనీస ధర సైతం పలకకపోవడంతో కూలీ డబ్బులు సైతం గిట్టడం లేదని రైతులు వాపోతున్నారు. ధర పలుకకపోవడంతో మామిడి కాయలను మార్కెట్ ఆవరణలోనే వదిలి వెళ్లిపోతున్నారు. ప్రకృతి శాపానికి గురైన మామిడి రైతుల కష్టాలు తీర్చడానికి వీలుగా అధికారులు చర్యలు తీసుకోని, ప్రభుత్వ గోదాముల్లో నిల్వ చేసుకునే అవకాశం కల్పించాలని మామిడి రైతులు కోరుతున్నారు.

160
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...