ఉపాధిభోక్తపై విచారణ


Mon,April 22, 2019 03:02 AM

ధర్మసాగర్, ఏప్రిల్21: వేలేరు మండలంలోని మద్దెలగూడెం గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ తన కుటుంబ సభ్యుల పేర పని చేయకున్నా డబ్బులు కాజేశారని, గ్రామంలోని మరి కొంత మంది పని చేసినా డబ్బులు ఇవ్వలేదంటూ నాలుగు రోజుల క్రితం ధర్మసాగర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామస్తులు నిరసన వ్యక్తం చేసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై నమస్తేతెలంగాణలో ఉపాధి భోక్తశీర్షికన అక్రమాలను వెలుగులోకి తెస్తూ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్‌గా స్పందిస్తూ.. అధికారులు విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈమేరకు ఆదివారం విజిలెన్స్ అధికారి నర్సింహారెడ్డి, ఎంపీడీవో జవహర్‌రెడ్డి, ఏపీవో సంపత్ కుమార్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అధికారులతో మాట్లాడుతూ..జాబ్ కార్డులో ఒకరి పేరు ఉండి మరొకరి చేత పని చేయించారని, గతంలో విచారణ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని చెప్పారు. కార్డు హోల్డర్‌కు వయస్సు పరిమితి లేకుండా పని చేయలేని వారి పేరున జాబ్ కార్డు ఇచ్చి పైసాలు డ్రా చేశారని వెల్లడించారు. పని చేయలేని స్థితిలో ఉన్న వారి పేర జాబ్‌కార్డు ఇచ్చి ఫిల్డ్‌అసిస్టెంట్ భార్యతో పని చేయించారని, ఆ పనికి ఎక్కువగా డబ్బులు డ్రా చేశారని చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఫిల్డ్‌అసిస్టెంట్ మిట్ట రాజు తన కుటుంబ సభ్యులైన ఇద్దరు వ్యక్తుల పేరు డ్రా చేసిన రూ. 1,20,900 డ్రా చేసిన తీరును, మరికొంత మంది వ్యక్తుల డబ్బులు ఇవ్వలేదని ఆరోపణలపై విచారణ చేశామని అధికారులు తెలిపారు. డీఆర్‌డీఏ పీడీ రాముకు విచారణ నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...