మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్లపై ప్రత్యేక దృష్టి


Sun,April 21, 2019 02:10 AM

వరంగల్, నమస్తేతెలంగాణ: సంపూర్ణ పారిశుధ్య స మాజ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం మానవ వ్యర్థా ల శుద్ధీకరణ కేంద్రాలపై ప్రత్యేక దృషి ్టసారిస్తుందని కేం ద్ర తాగునీరు, పారిశుధ్యశాఖ కార్యదర్శి పరమేశ్వరన్ అ య్యర్ అన్నారు. శనివారం కార్పొరేషన్ పరిధిలోని అ మ్మవారిపేటలోని మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ నీతూప్రసాద్‌తో కలిసి సందర్శించారు. ఎఫ్‌ఎస్‌టీపీ ప్లా ంట్ పనితీరును ఆయన పరిశీలించారు. అక్కడ అవలంభిస్తున్న విధానాలు, వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భం గా ఆయన మాట్లాడుతూ సంపూర్ణ పారిశుధ్య నిర్వహణ ఓడీఎఫ్ ప్లస్‌లో భాగంగా మానవ మల వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాలపై అధ్యయనం చేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగానే దేశంలో మొట్టమొదటి సారిగా ప్ర యోగాత్మకగా గ్రేటర్ వరంగల్‌లోని అమ్మవారిపేటలో ఏర్పాటు చేసిన మానవ వ్యర్థాల శుద్ధ్దీకరణ కేంద్రాన్ని ప రిశీలించామన్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాలలో సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరించే మానవ వ్యర్థాల శుద్ధ్దీకరణ కేంద్రాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నదని అన్నారు. వందశాతం సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరించిన వ్యర్థాలను శుద్ధీకరణ చేసేందుకు మా ర్గాలను అన్వేషిస్తున్నామన్నారు. అమ్మవారిపేటలోని ఎ ఫ్‌ఎస్‌టీపీలో థర్మల్, జియోట్యూబ్ విధానాలను నిశితంగా పరిశీలించామని, ఇది ఎంతో ఉపయుక్తంగా ఉం దన్నారు. ఇక్కడి ప్లాంట్ అందిస్తున్న ఫలితాల ఆధారం గా ఓడీఎఫ్ ప్లస్ లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.

జాగ్రత్తలు తీసుకోవాలి
సెప్టిక్ ట్యాంకుల నుంచి వ్యర్థాలను సేకరించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పరమేశ్వరన్ అయ్యర్ అన్నారు. నగరానికి పది కిలోమీటర్ల ఉన్న గ్రా మాలను మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటులతో అనుసంధానం చేయాలన్నారు. అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవ న్ పాటిల్ మానవ వ్యర్థాల శుద్ధ్దీకరణ ప్లాంటు వివరాలను ఆయనకు వివరించారు. రోజుకు 15వేల లీటర్ల సా మర్థ్యం, 10 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మరో ప్లాం ట్‌ను నిర్మిస్తున్నామన్నారు. సెప్టిక్ ట్యాంకు వాహనాలు జియోట్యాగింగ్ అనుసంధానం చేశామని వివరించారు. అమ్మవారిపేట శుద్ధీకరణ కేంద్రానికి ఇప్పటి వరకు 460 సెప్టిక్ ట్యాంకుల నుంచి 1800కిలో లీటర్ల వ్యర్థాన్ని సేకరించామన్నారు. సగటున రోజుకు 8 నుంచి 10 కిలో లీటర్ల సెప్టిక్‌ను సేకరిస్తున్నట్లు వివరించారు. అనంతరం కలెక్టర్‌తో కలిసి పరమేశ్వరన్ శుద్ధీకరణ కేంద్రంలో మొ క్కలు నాటారు. కార్యక్రమంలో గ్రేటర్ కమిషనర్ ఎన్ రవికిరణ్, ఆర్‌డీవో వెంకారె డ్డి, ఆస్కీ డైరెక్ట ర్ శ్రీనివాసాచా రి, మున్సిపల్ ఎస్‌ఈ భిక్షపతి, ఎంహెచ్‌వో రా జారెడ్డి, సీహెచ్ వో సునీత, త హసీల్దార్ నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...