రాష్ట్రస్థాయి ర్యాంకులు అభినందనీయం


Sun,April 21, 2019 02:10 AM

అర్బన్ కలెక్టరేట్, ఏప్రిల్ 20: స్థాపించిన మొ దటి సంవత్సరంలోనే షైన్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం అభినందనీయమని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శనివారం కళాశాల చైర్మన్ ముగాల కుమార్‌యాదవ్, డైరెక్టర్లు డాక్టర్ వేణుయాదవ్, రాజేంద్రకుమార్, రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు జీ విగ్నేశ్వర్, ఎం లక్ష్మీఅర్చిత ఎమ్మెల్యేను క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ కళాశాల యాజమాన్యం, ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. షైన్ కళాశాల స్థాపించిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సా ధించడం అభినందనీయం అని కొనియాడారు. నిష్ణాత్నులైన లెక్చరర్లు, క్రమ శిక్షణ, చక్కటి ప్రణాళిక, నాణ్యమైన విద్య అందిస్తే ఇలాంటి ర్యాంకులు సాధ్యమవుతాయని చెప్పారు. ర్యాంకుల సాధనకు కృషి అధ్యాపకులు, విద్యార్థులు, సహకరించిన తల్లిదండ్రులను ఆయన అభినందించారు. మొద టి సంవత్సరంలోనే ర్యాంకు లు సాధించారంటే కళాశాల యాజమాన్యం నిరంతర పర్యవేక్షణ, పక్కా ప్రణాళికలు అమలు చేయడమేనన్నారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా మరింత మెరుగ్గా రాణించాలన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో కళాశాల యాజమాన్యం, విద్యార్థులు, ప్రిన్సిపాల్ పీ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

125
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...