నేడు, రేపు ఎస్సై తుది రాత పరీక్ష


Sat,April 20, 2019 02:03 AM

వరంగల్ క్రైం, ఏప్రిల్19 : రాష్ట్ర పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో చేపట్టిన ఎస్సై ఉద్యోగాల ఎంపికకు నేడు, రేపు (శని,అదివారాల్లో) తుది రాత పరీక్షకు కమిషనరేట్ పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. రాత పరీక్ష ఏర్పాట్లకు సంబంధించి రీజినల్ కో-ఆర్డినేటర్ కేయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పీ మల్లారెడ్డి, పోలీస్ నోడల్ అధికారి వెస్ట్‌జోన్ డీసీపీ బీ శ్రీనివాస్‌రెడ్డి, బయోమెట్రిక్ విభాగం అధికారి షీ టీం ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రావుతో సీపీ రవీందర్ శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ 19 పరీక్ష కేంద్రాల్లో 11,874 మంది అభ్యర్థ్ధులు హాజరవుతున్నారని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్ష నిర్వహించబడుతుందన్నారు. 19 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 26 మంది పరిశీలకులు, 56 మంది బయోమెట్రిక్ పరిశీలకులు విధుల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. పరీక్ష సజావుగా సాగేందుకు పోలీస్ యంత్రాంగం నుంచి ఏడుగురు ఇన్‌స్పెక్టర్లు, 14 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 90 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొంటున్నారని, పరీక్ష కేంద్రాలకు వచ్చే అభ్యర్థ్ధులను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా 72 మంది కానిస్టేబుళ్లను నియమించినట్లు తెలిపారు.

అదనంగా ఆర్టీసీ బస్సులు
సూదూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు త్వరగా వెళ్లేందుకు బస్టాండ్, రైల్వే స్టేషన్ల నుంచి పరీక్ష కేంద్రం వరకు అదనంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. అదే విధంగా పరీక్ష కేంద్రాల అడ్రస్ తెలిపేందుకు రైల్వేస్టేషన్, బస్టాండ్స్, ముఖ్య కూడళ్లలో పోలీస్ హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...