యువత నేవిలో చేరాలి


Fri,April 19, 2019 03:00 AM

మామునూరు, ఏప్రిల్18: జాతి రక్షణ యువతపైనే ఆధారపడి ఉందని, దేశ సేవ కోసం నావికా దళంలో చేరాలని భారత నావికా దళం కమాండర్ సతీశ్ అన్నారు. నగరంలోని ఐదో డివిజన్ బొల్లికుంటలోని వాగ్దేవి విద్యాసంస్థల్లో కళాశాల ఎన్‌సీసీ విభాగం ఆధ్వర్యంలో గురువారం భారత నావికా దళం-ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమాండర్ సతీశ్ హాజరై సదస్సును ప్రారంభించి మాట్లాడారు. యువతను ప్రోత్సహించడానికి ప్రొఫెలర్స్ అండ్ వీల్స్ స్టీరింగ్ టు షేప్ ది యూత్ అనే నినాదంతో దేశ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. చాలా మంది నావికా దళంలో చేరడానికి వస్తున్నారని పేర్కొన్నారు. సత్ప్రవర్తన, దేశభక్తి ఉన్న యువకులు ఈ రంగంలోకి రావాలన్నారు. నూతనంగా వచ్చిన ప్రతీ సాంకేతిక విజ్ఞానాన్ని సైనిక వ్యవస్థలోనే వినియోగిస్తున్నందున, సైనిక రంగంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు అపారంగా ఉన్నాయని చెప్పారు. సైనిక వ్యవస్థపై ఉన్న అపోహలను వీడాలని కమాండర్ అన్నారు. ఈ సందర్భంగా సైనిక వ్యవస్థలో గల వివిధ రంగాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. కార్యక్రమ నిర్వాహకులను కళాశాల యాజమాన్యం డాక్టర్ దేవేందర్‌రెడ్డి, డాక్టర్ సత్యపాల్‌రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ ప్రకాశ్, డాక్టర్ ప్రసాదరావు, డీన్ సోమిరెడ్డి, ఎన్‌సీసీ ఒకటో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ వీఆర్ రావు, ఎన్‌సీసీ అధికారులు, సీనియర్ కేడెట్స్, ఎన్‌సీసీ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...