ఉపాధి భోక్త


Thu,April 18, 2019 01:43 AM

(వరంగల్ ప్రధానప్రతినిధి-నమస్తేతెలంగాణ): అతనో సా ధారణ ఫీల్డ్ అసిస్టెంట్. కానీ కూలీల డబ్బులు కాజేయడంలో అసామాన్యుడు. అంతా తన చేతిలో పని. తన వాళ్లు, అది కూ డా వయసుడిగిన వాళ్లే అయినా వాళ్లు కూలీలనే రికార్డుల్లోకి ఎ క్కించి ఆ ఇద్దరి పేరు మీద లక్షా రెండువేల తొమ్మిది రూపాయలను కాజేశాడని గ్రామ కూలీలు నిరసనగళమెత్తారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధుల్ని తన ఇష్టానుసారం దుర్వినియోగం చేశాడని గ్రామంలోని కూలీల ఆరోపణ. ఎండకు ఎండి ఇంటిని, పిల్లల్ని ఒదిలి ఉపాధికోసం కూలీపోతే తమకు న్యా యంగా రావాల్సిన పైసల్ని కూడా ఇవ్వకుండా కాజేస్తున్నాడని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టార్జితం తమకు ఇవ్వమంటే తమకు రావలసిన సొమ్ములో సగం అతనే మెక్కేస్తున్నాడని కూలీలు ఆవేదన భరితం అవుతున్నారు. తమ డబ్బు తమకు ఇవ్వమంటే వెయ్యి రూపాయలు, క్వార్టర్ మందు ఇస్తేగానీ సదరు ఫీల్డ్ అసిస్టెంట్ ఇవ్వటం లేదని ఓ రైతు తీవ్ర ఆరోపణ చేస్తున్నాడు. మరో మహిళాకూలీ అయితే సా రూ... పిల్లగాల్లకు సరిగా బువ్వపెట్టకుండా కూలీకి వస్తే అందులోనూ సగం తనకు ఇస్తేనే డబ్బులు ఇచ్చాడని ఆవేదన చెందుతున్నది. ఎట్లయినా సరే మాకా ఫీల్డ్ అసిస్టెంట్ వద్దు అని వాళ్లే కాదు గ్రామంలోని ఉపాధి కూలీలందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ మద్దెలగూడెం కొట్టిన ధర్మగంట.

తన నానమ్మ..తాతలు కూలీలే..
మద్దెలగూడెం.. జిల్లాలోని వేలేరు మండలంలోని ఊరు. అ క్కడ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్ని పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్ మిట్ట రాజుపై కూలీలంతా తిరుగబడ్డారు. తాము చే సిన కూలీ డబ్బులు ఇవ్వమంటే డబ్బులు అడుతున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన్ను మారిస్తేనే కూలీ పై సలు తమకు న్యాయంగా వస్తాయని డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ మిట్ట రాజు వృద్ధులైన తన కుటుంబ సభ్యుల పేరున, పని చేయకపోయిన ఒక లక్ష ఇరువై వేల తొమ్మిది వందల రూపాయాలను డ్రా చేశాడని ఆధారాల తో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మిట్ట రామక్క, మిట్ట ఆగమ్మ. ఇద్దరూ వృద్ధులే. వారెప్పుడూ తమతో పనిచేయలేదు. అసలు వాళ్లు వృద్ధులు వాళ్లెక్కడ పనిచేశారు. కావాలని మా ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ల పేరుమీద రికార్డులు సృష్టించి కాజేశాడని కూ లీలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇదే విషయమై ఈనెల 9న గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రా మస్తులు సమక్షంలో అతనిని పిలిచి నిలదీశారు. ఆ డబ్బును తాను డ్రా చేసింది వాస్తమే కానీ సదరు డబ్బును రోడ్డుకు ఇరువైపుల మొక్కలను నాటించి, వాటికి వాటర్ ట్యాంకర్‌తో నీళ్లు చల్లించినందుకు వినియోగించానని పేర్కొనడంతో గ్రామస్తులు ఖంగుతిన్నారు.

పైగా ఈ విషయం ఏపీవో నోటీసులో ఉందని కూడా బుకాయించారట. అయితే పనిచేయని వాళ్లకే ఇస్తారు. కానీ తాము పనిచేసినా తమకు డబ్బులు ఇవ్వలేదని గ్రామంలోని ఉపాధి కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బు ధవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. తమ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలైన సుంకరి రవీందర్, ఉల్లి పద్మ, జల్తారి వీరయ్య, మిడిపెల్లి రాజ య్య, మద్దురి గట్టయ్య, గుర్తురి వెంకటలక్ష్మి, గుర్తురి పద్మ, సు తారి వినోద గ్రామస్తులను తెలుసుకోగా పనిచేసిన తమకు కా దని పనిచేయనివారికి ఆ డబ్బులు ఎలా చెల్లించారని మండిపడ్డారు. ఇటువంటి వ్యక్తిని తొలగించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

దారి మళ్లింపు నిజమేనా?
జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో కూలీలకు చెల్లించాల్సిన నిధులు పక్కదారి పట్టాయా అంటే మద్దెలగూడెంలో వ్యవహా రం నిజమేనని అధికారుల విచారణలో తేలినట్టు సమా చారం. పనిచేయని వారి పే రున, అది కూడా తన నాన మ్మ, తాత పేరు మీద కావాలని కాజేశారని ఆరోపణలు వస్తున్నాయి. పైగా రోడ్డు కిరువైపులా మొక్కలు నాటి, ట్యాంకర్లతో నీళ్లు కొట్టించేందుకు వినియోగించానని త ను చెప్పిన కారణం అనేక అ నుమనాలకు తావిస్తుంది. మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోసినందుకు నిర్వహ ణా ఛార్జీలు చెల్లించడం సర్వసాధారణం. అయితే వాటిని కూలీల పేరుపన డ్రా చేయ డం వెనుక ఆంతర్యం ఏమి టి? ఇందులో దాగిన మతల బు ఏమిటి? అన్న అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.

సగం పైసలు ఇచ్చిండు సగం తీసుకున్నడు
మామిడిచెట్లకు నీళ్ళు పోస్తే రూ.12 వేలు వస్తాయని చె ప్పి వేలు ముద్రపెట్టించి రూ. 12వేలు తీసి ఫస్టు ఆయన రూ.6వేలు తీసుకొని తరువాత నాకు రూ. 6 వేలు ఇచ్చా డు. ముందుగా చెప్పిన విధంగా ఆయన నాకు రూ. 12.000 వేలు ఇవ్వలేదు. నా చేతి వేలు ముద్రపెట్టించి మ రి నా వద్ద నుంచి సగం పైసలు తీసుకున్నాడు. నేను, నా భ ర్త (సుతారి వినోద నర్సయ్య) కష్టపడి మామిడి చెట్లకు నీ ళ్ళు పోశాం. చెట్ల చుట్టూ కంపనాటి పని చేస్తే మాకు ఆ రాజు గింత అన్యాయం చేసిండు. మా పైసలు సగం తీసుకున్నా డు. మేము కష్టపడ్డ పైసలు మాకు రావాలే ఇలాంటి వారిని పనిలో నుంచి తీసేయాలి.
- సుతారి వినోద

రూ. వేయి, కోటర్ మందు ఇస్తేనే బిల్లు..
నేను మల్బరీ తోట సాగు చే స్తున్నా. ప్రతి నెల రూ. 3వేలు రావాలి. రెండు నెలల రూ. 6 వేల బిల్లు కోసం వేయి రూపాయలు, క్వాటర్ మందు ఇస్తేనే బిల్లు పెట్టి రూ. 6వేలు ఇ చ్చా డు. ఇప్పటి వరకు మళ్లీ పై సలు ఇవ్వలేదు, 5 నెలల బిల్లు ఆపి ఇంకా ఇవ్వలేదు. అతడు కలిసిన ప్రతి సారి బిల్లు పెట్టినవా రాజు అని అడిగితే.. అతను మాత్రం వస్తాయి అంటూ దాట వేసుకుంటూ పోతున్నాడు తప్ప బిల్లు మాత్రం ఇవ్వ డం లేదు. ఏకపక్షంగా గ్రామంలో అతను పని చేస్తున్నాడు. ఇత డు మాకు వద్దు. ఒక పక్క ప్రభుత్వం మాత్రం రైతులతో మంచిగా ఉంటే ఇతను మాత్రం రైతులను, కూలీలను ఇ బ్బంది పెట్టిండు.
- మిడిపెల్లి రాజయ్య

176
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...