కౌన్ బనేగా మేయర్..!


Thu,April 18, 2019 01:42 AM

వరంగల్,నమస్తేతెలంగాణ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ పదవి ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. మేయర్ నన్నపునేని నరేందర్ తూర్పు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో ఆయన మేయర్ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం డిప్యూటీ మేయర్‌గా ఖాజాసీరాజుద్దీన్ ఇన్‌చార్జి మేయర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి గ్రేటర్ వరంగల్ మేయర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో కొత్త మేయర్ ఎవరూ అనే దానిపై ఇప్పుడు రాజకీయంగా చర్చ సాగుతోంది. ఇంకా రెండు సంవత్సరాల పదవీ కాలం ఉండడంతో మేయర్ పదవి కోసం ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారే చూసుకుంటున్నారు. ఈ నెల 27న మేయర్ ఎన్నిక చేపట్టాలని ఎన్నికల కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కోనడంతో కార్పొరేటర్లలో సైతం కొత్త మేయర్ ఎవరన్నదనాపై ఉత్కంఠ నెలకోంది. మూడు రోజులుగా ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో ఉన్న తరుణంలో ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో ఆశావహులు అంతా తమ గాడ్ ఫాదర్ల ఆశీస్సుల కోసం రాజధానికి పరుగులు పెట్టారు.

కార్పొరేటర్లలో ఉత్కంఠ
బల్దియా బాదుషా ఎవరూ అనే దానిపై కార్పొరేటర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కార్పొరేషన్ కార్యాలయంలో ఏ నలుగురు కలిసినా కొత్త మేయర్ ఎవరూ అనే దానిపైనే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఏ ప్రాంతానికి మేయర్ పదవి దక్కుతుందనేదే ప్రధాన చర్చగా సాగుతోంది. కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుంచి ఎక్కువగా పశ్చిమ నియోజకవర్గం నుంచి మేయర్ పదవి దక్కింది. 2015లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో నగరంలో వెనకబడిన ప్రాంతంగా చెప్పుకోనే తూర్పు నియోజకవర్గం నుంచి మొదటిసారిగా నన్నపునేని నరేందర్‌కు అవకాశం వచ్చింది. ఆయన కేవలం 30 నెలలు మాత్రమే మేయర్‌గా పనిచేశారు. ఇప్పుడు కొత్త మేయర్ ఏ ప్రాంతం నుంచి అవకాశం దక్కుతుందో అన్న ఉత్కంఠ నెలకోంది. కార్పొరేషన్ పరిధిలో ముఖ్యంగా తూర్పు, పశ్చిమ, విలీన గ్రామాల ప్రాంతాలు ఉన్నాయి. కొత్త మేయర్ ఈ మూడు ప్రాంతాలలో ఏవ్వరికి దక్కుతుందో వేచిచూడాలి.

ఆశావహులు రాజధాని బాట
మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆశాశహులు రాజధాని బాటపట్టారు. మేయర్ పదవి కోసం పలువురు పోటీపడుతున్నారు. ప్రస్తుతం ఇన్‌చార్జి మేయర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఖాజాసీరాజుద్దీన్ సైతం రాజధాని బాటపట్టారు. దీంతో పాటు మేయర్ పదవి అశిస్తున్న కార్పొరేటర్లు రెండు రోజులుగా హైదరాబాద్‌లోనే మాకాం వేశారు. తూర్పు నియోజకవర్గం నుంచి 26వ డివిజన్ కార్పొరేటర్ గుండా ప్రకాశ్‌రావు, 24వ డివిజన్ కార్పొరేటర్ గుండు ఆశ్రితారెడ్డి, 28వ డివిజన్ కార్పొరేటర్ యెలగం లీలావతి, పశ్చిమ నియోజకవర్గం నుంచి 48వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్ రావు, 53వ డివిజన్ కార్పొరేటర్ నాగమళ్ల ఝాన్సీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైన కొత్త మేయర్ ఎవరనే దాని కోసం మరో 10 రోజులు వేచి చూడాల్సిందే.

200
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...