ఈ ఆఫీసులు అవినీతి రహితం


Thu,April 18, 2019 01:42 AM

ఏటూరునాగారం/వెంకటాపూర్: మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఈ ఆఫీసు అవినీతి రహితం, లంచం అడిగితే ఫిర్యాదు చేయండి అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవ్వరూ కూడా రెవెన్యూ సేవలకు డబ్బులు ఇవ్వవద్దని, మీ యొక్క ప్రతీ దరఖాస్తు నిర్ణీత సమయంలో పరిష్కరించబడుతుందని, వీఆర్‌ఏ, వీఆర్‌వోలు, సిబ్బంది ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలంటూ ఫోన్ నెంబర్లను ఇచ్చారు. తహసీల్దార్ 9490340194, డిప్యూటీ తహసీల్దార్ 9440592746క అంటూ పేర్కొన్నారు. ఒక వేళ మేము అడిగిత జిల్లా కలెక్టర్ 7680959696, ములుగు ఆర్డీవో 7680906652 నెంబర్లకు ఫిర్యాదు చేయాలంటూ అందులో వివరించారు. వెంకటాపూర్ మండలంలోని ఇంచెంచెర్వుపల్లి గ్రామానికి చెందిన రైతు ఇటీవల తహసీల్ కార్యాలయంలో ఆత్మహత్యకు ప్రయత్నించడంతో.. దుమారం చెలరేగింది. దీనికి తోడు కొందరు పోడు భూములు సాగు చేసుకున్న రైతులు.. పట్టాలు పొందేందుకు.. వీఆర్‌వోలకు లంచం ఇవ్వాలంటూ భిక్షాటన చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అవినీతి మచ్చను తుడిపేసేందుకు అధికారులు కార్యాలయంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఒకవేళ కింది స్థాయి సిబ్బంది లంచాలు అడిగితే తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌కు (7680906626, 7093257612 నంబర్లలో), ఒక వేల వాళ్లే లంచాలు అడిగితే జిల్లా కలెక్టర్, లేదా ఆర్‌డీవో ములుగు (7680959696, 7680906652నంబర్లలో)కు సమాచారం ఇవ్వాలంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు.

146
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...