స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య


Wed,April 17, 2019 02:24 AM

ధర్మసాగర్, ఏప్రిల్ 16 : విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల 54వ డివిజన్ శ్రీనివాస రామానుజన్ హైస్కూల్‌లో మంగళవారం పాఠశాల పూర్వ విద్యార్థి, సివిల్స్‌లో ర్యాంకర్ సీహెచ్ శ్రీపాల్‌రెడ్డికి సన్మాన కార్యక్రమం స్కూల్ అకాడమిక్ అడ్వయిజర్ ముచ్చ రాజిరెడ్డి అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజయ్య, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. పాఠశాల స్థాయిలో నేర్చుకున్న విద్య జీవితంలో ఉన్నతులుగా తీర్చిదిద్దుతుందని అన్నారు. వి ద్యార్ధి దశ నుంచే జీవితంలో లక్ష్యాన్ని ఎంచుకుని ని రంతరం శ్రమించాలని అన్నారు. శ్రీపాల్‌రెడ్డి తన సర్వీస్‌లో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చే యాలని ఆకాంక్షించారు. మనకు విద్యాబోధన చేసిన గురువులను మరువకూడదని అన్నారు. భారత రా జ్యాంగం మనకు కల్పించిన విద్యాహక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సమాజానికి ఆదర్శప్రాయులుగా ఎదగాలని అన్నారు. సివిల్స్ ర్యాం కర్ శ్రీపాల్‌రెడ్డిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోని జీవితంలో ఉన్నతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం సివిల్స్ ర్యాంకర్ శ్రీపాల్‌రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ కేసీ జాన్‌బెన్ని, స్కూల్ కరస్పాండెంట్ అరుణారెడ్డి, ప్రిన్సిపాల్ రవి కుమార్, జెడ్పీటీసీ వెంకటేశ్వర్లు, సంతోష్‌రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

134
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...