పాలిటెక్నిక్ విద్యతో మెండుగా ఉద్యోగావకాశాలు


Wed,April 17, 2019 02:24 AM

- ఎస్వీఎస్ విద్యాసంస్థలచైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమల్‌రావు
-విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన సదస్సు
భీమారం,ఏప్రిల్16: పాలిటెక్నిక్ విద్యతో దేశవ్యాప్తంగా మెండుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఎస్వీఎస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమల్‌రావు అన్నారు. గ్రేటర్ పరిధిలోని భీమారం ఎస్వీఎస్ పాలిటెక్నిక్ కాలేజీలో మంగళవారం పాలిటెక్నిక్ విద్య-భవిష్యత్ అనే అంశంపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తిరుమల్‌రావు మాట్లాడుతూ మల్టినేషనల్ కంపెనీలో ఉద్యోగుల కొరత ఉండి పాలిటెక్నిక్ కోర్సులకు డిమాండ్ ఏర్పడిందని అన్నారు. పాలిటెక్నిక్ కోర్సు చేసిన విద్యార్థులకు వెంటనే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. సివిల్, ఈఈఈ, మెకానిక్ కోర్సులు చేసిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వందలాది కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం కాలేజీలో ప్రత్యేకంగా ఇంగ్లీష్ విద్యలో పట్టుసాధించేందుకు ఇంగ్లీష్ ల్యాబ్‌ను నెలకొల్పామని, విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం ఇంగ్లిష్‌లో ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్వీఎస్ పాలిటెక్నిక్ కాలేజీ సీట్లుల్లో 10 నుంచి 20 శాతం వరకు నిరుపేద విద్యార్థులకు కాలేజీ ఫీజును రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులకు నాణ్యమైన పాలిటెక్నిక్ విద్యను అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు ఉచితంగా సీటు ఇస్తామన్నారు. ఎస్వీఎస్ విద్యాసంస్థల సెక్రటరీ ఎర్రబెల్లి అనూప్ మాట్లాడుతూ ఎస్వీఎస్ పాలిటెక్నిక్, ఎస్వీఎస్ డిప్లొమా కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ను వివిధ కంపెనీల ద్వారా క్యాంపస్ ఇంటర్వ్యూల్లో అధిక అవకాశాలు వస్తున్నాయని అన్నారు. ఈసీఈ, సీఎస్‌ఈ కోర్సుల నుంచి 45 మందిని నియామకం చేసుకున్నరని తెలిపారు. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రఘు, ఎస్వీఎస్ శ్రీచైతన్య కాలేజీ డీన్ డాక్టర్ రమేశ్, ప్రొఫెసర్లు రామయ్య, కుమార్, పాలిటెక్నికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్ డాక్టర్ అమిత, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

183
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...