అందరి అద్భుతం


Wed,April 17, 2019 02:24 AM

-పార్లమెంట్ ఎన్నికల విజయవంతంలోకృషి అభినందనీయం
-మే 23న జరిగే కౌంటింగ్‌కు సహకరించాలి
-విలీన గ్రామాల అభివృద్ధిలోభాగస్వాములు కావాలి
-25వ తేదీ వరకుకొత్త ఓటర్ల నమోదు
-కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
అర్బన్‌కలెక్టరేట్, ఏప్రిల్ 16: జిల్లాలో అందరి సహకారంతో పార్లమెంట్ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్‌కు సహకరించినట్లుగానే.. మే 23న జరిగే కౌంటింగ్‌కు, త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాలతో పాటు గ్రామస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు పార్టీలకు అతీతంగా సహకారం అందించాలన్నారు. ఇందుకోసం ప్రతీ మూడు నెలలకోసారి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి జిల్లా అభివృద్ధికి తగు సూచనలు, సలహాలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. అమృత్ పథకం ద్వారా జిల్లాకు రూ.600కోట్లు మంజూరైనట్లు చెప్పారు. 2020 జూన్ వరకూ తాగునీటి సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగులను ప్రోత్సహించేందుకు బ్యాంకర్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

కార్పొరేషన్ పరిధిలోని మురికివాడల్లో ఈ వేసవిలో రెండు రోజులకోసారి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే నూతన నిర్మాణాలకు అ నుమతి ఇచ్చే సమయంలో తప్పకుండా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కడిపికొండ నుంచి నాయుడు పెట్రోల్ పంపు వరకు, , కడిపికొండ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు రోడ్డ నిర్మాణ పనులకు భూ సేకరణ కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
25 వరకు కొత్త ఓటర్ల నమోదు
జిల్లాలో ఈ నెల 25వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతుందని కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ తెలిపారు. ఇందుకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నాయకులు నూత న ఓటర్లను చైతన్యపరిచి పేర్లు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో జేసీ ఎస్ దయానంద్, టీఆర్‌ఎస్ నుంచి ఇండ్ల నాగేశ్వర్‌రావు, కాంగ్రెస్ నుంచి నాయిని రాజేందర్‌రెడ్డి, ఈవీ శ్రీ నివాసరావు, బీజేపీ నుంచి రావు పద్మ, సీపీఐ నుంచి కర్రె భిక్షపతి, సీపీఎం నుంచి జీ ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ నుంచి పుల్లూరి కుమార్, ఇతర పార్టీల నాయకులు గందం శివ తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...