పింగిళి కాలేజీలో ఈ-లెర్నింగ్ జాతీయ వర్క్‌షాపు


Wed,April 17, 2019 02:23 AM

-హాజరైన అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం వీసీ సీతారామారావు
సిద్ధార్థనగర్, ఏప్రిల్ 16: వడ్డెపల్లిలోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ, పీజీ కళాశాలలో రూసా సహకారంతో మంగళవారం ఈలెర్నింగ్ పై జాతీయస్థాయి వర్క్‌షాపును కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి ఇందిర అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కే. సీతారామారావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మా రుతున్న కాలానుగుణంగా ఈలెర్నింగ్ నేడు అధ్యాపకుల కంతటికీ ఎం తో అవసరమన్నారు. విద్యార్థి సృజనాత్మకంగా ఎదిగి విద్య గుణాత్మకంగా తయారు కావాలని పేర్కొన్నారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రామబ్రహ్మం మాట్లాడుతూ బోధనలో ఉపాధ్యాయుడు ప్రధాన కేంద్ర బిందువైనప్పటికీ బోధనాపద్దతుల్లో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్మరించడం సాధ్యం కాదని మూక్స్ ద్వారా విద్యార్థిలో నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ బి. దర్జన్, అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సరోజ, వైస్ ప్రిన్సిపాల్ లీలా, రేణుక, రామకృష్ణా, మార్క శంకర్‌నారాయణ, ఫాతిమా, భాస్కర్, విజయలక్ష్మి, శ్రీనివాసరెడ్డి, రాంభాస్కర్‌రాజు, సోమన్న, వేణుమాధవ్ పాల్గొన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...