పోచమ్మ గుడి స్థలం కబ్జాకు యత్నం


Wed,April 17, 2019 02:23 AM

-మహిళా పూజారిపై దాడి
-అడ్డుకున్న స్థానికులు
-కబ్జాదారుడిపై పోలీసులకు ఫిర్యాదు
వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 16: వరంగల్ కాశిబుగ్గ ఎస్‌ఆర్ నగర్ ప్రాతంలోని పోచమ్మగుడి స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది. దేవస్థాన స్థలం తమదేనని ఈ స్థలాన్ని ఖాళీ చేయాలని దేవాలయ మహిళా పూజారిపై కబ్జాదారులు దాడి చేశారు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. స్థానిక ఎస్‌ఆర్‌నగర్ ప్రాంతంలోని పోచమ్మగుడి ఆవరణ స్థలం తమదేనని ఈ స్థలంలో నిర్మాణం చేపట్టనున్నామని వెంటనే ఇక్కడి స్థలాన్ని ఖాళీ చేయాలని పల్లకొండ సారయ్య, పల్లకొండ హరి, పల్లకొండ చంద్రమోహన్ కొంత మంది యువకులను వెంట బెట్టుకొని వచ్చి బెదిరింపులకు గురి చేశారు. దాంతో స్థానికులు భూమిపై మీకు గల హక్కు పత్రాలను చూపాలని కోరడంతో తమ భూమిని తాము స్వాధీన పరుచుకునేందుకు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరమేముందంటూ దూషించడంతో పాటుగా అడ్డుకోవడానికి ప్రయత్నించిన మహిళా పూజారి సముద్రాల సుజాత పై దాడి చేశారు. స్థానిక పెధ్ధలు సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన విషయం పై వివరణ కోరడంతో వారిని సైతం దూషించి చంపుతానని బెదిరించడంతో పాటు తనకు జాతీయ పార్టీ నాయకులతో మంచి సాన్నిహిత్యం ఉందని వారి కొండంత అండదండలు కలిగివున్నానని, మా విషయంలో తలదూర్చిట్లయితే ప్రాణాలు తీస్తామని హెచ్చరించినట్లు తెలిపారు. ఈ సంఘటనపై స్థానిక ఇంతేజార్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఇంతేజార్‌గంజ్ సీఐ శ్రీధర్ తెలిపారు.

138
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...