పన్ను వసూళ్లలో వరంగల్ మార్కెట్ చివరి స్థానం


Wed,April 17, 2019 02:23 AM

కాశీబుగ్గ, ఏప్రిల్16: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ల పన్ను వసూళ్ల టార్గెట్ రూ.55కోట్ల97లక్షలకు గాను రూ.45కోట్ల40లక్షలు వసూలు చేసి 81శాతం నిలిచాయి. అందులో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ టార్గె ట్ రూ.27కోట్లకు గాను రూ.19కోట్ల 85 లక్షలు వసూలు చేసి 73.69శాతంగా చివరి స్థానానికి దిగజారింది. ఇటీవల కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా టార్గెట్ రూ.3కోట్ల 70లక్షలకు గాను రూ.4కోట్ల 17లక్షల 66వేలు వసూలు చేసి 112.88శాతంగా మొదటి స్థానంలో నిలిచింది. జనగామ జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, కొడకండ్ల, పాలకుర్తి మార్కెట్ల టార్గెట్ రూ.6కోట్ల 97లక్షలకు గాను రూ.6కోట్ల లక్షా 62వేలు వసూలు చేసి 86.32 శాతంగా రెండో స్థానంలో నిలిచింది, అలాగే వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని వ్యవసాయ మార్కెట్లు నర్సంపేట్, పర్కా ల, వర్ధన్నపేట్, నెక్కొండ, ఆత్మకుర్ టార్గెట్ రూ.9కోట్ల 90లక్షలకు గాను రూ.8కోట్ల 38లక్షల 52వేలు వసూలు చేసి మూడో స్థానంలో నిలిచాయి. మహబూబాబాదు జిల్లా పరిధిలోని కేసముద్రం, మహబూబాబాద్, తొర్రుర్ మార్కెట్ల టార్గెట్ రూ.8కోట్ల 40లక్షలకు గాను రూ.6కోట్ల 93లక్షల 15 వేలు వసూలు చేసి నాలుగో స్థానంలో నిలిచినట్లు మార్కెటింగ్‌శాఖ అధికారులు తెలి పారు. ఈ సీజన్‌లో పత్తి దిగుబడి చాలా వరకు తగ్గడంతో మార్కెట్ పన్ను తగ్గిందని అధికారులు అంటున్నారు.

127
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...