అంబేద్కర్ ఆదర్శనీయుడు


Mon,April 15, 2019 02:51 AM

న్యూశాయంపేట, ఏప్రిల్14: అంబేద్కర్ ప్రపంచానికే ఆదర్శనీయుడని తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా హన్మకొండ అంబేద్కర్ సెంటర్‌లోని విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి లిఖితపూర్వక రాజ్యాంగాన్ని అందించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్ని కొనియాడారు. దేశంలోని అన్ని వర్గాలకు, మతాలకు, కులాలకు సమాన గౌరవం వచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. రాజ్యాంగంలో పొందుపర్చిన మూల సూత్రాలను దళిత వర్గాలు పునఃసమీక్షించుకోవాలన్నారు. రిజర్వేషన్ల ద్వారానే అన్ని వర్గాల ప్రజలు ఉన్నతంగా జీవిస్తున్నారని చెప్పా రు. రాజకీయ నాయకులు, పార్టీలు తమకు అనుకూలంగా రిజర్వేషన్ల మార్పుకు ప్రయత్నిస్తున్నాయని, ఇది అంబేద్కర్ ఆశయానికి విఘాతం కల్పించడమేనన్నారు. హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి డంప్ యార్డుకు తరలించ డం విచారకరమన్నారు.

దేశంలో ని దళితులంతా ఐక్యంగా ఉండాలని రాజ్యాంగం లో పొందుపర్చిన హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ.. సాంఘీక సంక్షేమ కార్యక్రమాలు అంబేద్కర్‌తోనే సాధ్యమైందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, బీజేపీ ఎంపీ అభ్యర్థి చింతం సాంబమూర్తి, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, రావు పద్మ, జేసీ దయానంద్, ఈస్ట్ జోన్ డీసీపీ నాగరాజు, టీఆర్‌ఎస్ నాయకుడు, తాడు గౌరవ అధ్యక్షులు గుడిమళ్ల రవికుమార్, సీనియర్ నాయకులు పులి రజనీకాంత్, పూల్లురి అశోక్, శ్రమశక్తి అవార్డు గ్రహీత కుసుమ శ్యాంసుందర్, మంద కుమార్, మంద రాజు, వేల్పుల సూర్యం, కూరపాటి వెంకటనారాయణ, బీఎస్పీ నాయకులు తెలంగాణ వికాస సమితి రాష్ట్ర నాయకులు భిక్షపతినాయక్, బ్ర హ్మం, సోమనాయక్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వండ్లకొండ వేణుగోపాల్‌గౌడ్, దాడి మల్లయ్య, నాగపూరి సురేశ్, ఎంఎన్‌ఎస్ యూత్ రాష్ట్ర అధ్యక్షులు దుపాకి దయాకర్, తదితరులు పాల్గొన్నారు.

127
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...