ఆలయ అభివృద్ధికి సహకరిస్తా


Mon,April 15, 2019 02:50 AM

-కుడా చైర్మన్ మర్రియాదవరెడ్డి
న్యూశాయంపేట, ఏప్రిల్14: ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని కుడా చైర్మన్ మర్రియాదవరెడ్డి అన్నారు. హంటర్‌రోడ్డులోని అభయాంజనేయస్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణం నిర్వహించారు. ఈ మహోత్సవంలో మర్రియాదవరెడ్డి పాల్గొని మాట్లాడారు. అనతికాలంలోనే ఆలయాన్ని నిర్మించి సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరమని ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. కమిటీ కోరిక మేరకు దేవాలయ ప్రహరీ నిర్మిస్తానని, దేవాలయం నిర్మాణానికి సాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యదవరెడ్డిని ఆలయ కమిటీ సిబ్బంది శాలువాకప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు మార్త రాజేందర్, రామ్‌గోపాల్‌రావు, పిన్నింటి వెంకటేశ్వర్‌రావు, శ్రీధర్‌రావు, కిషన్‌రావు, సంపత్‌రావు, నీరంజన్‌రావు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
సీతారామ ప్రసన్నాంజనేయ దేవాలయంలో..
బాలసముద్రంలోని ఏకశిలా పార్కు వద్ద గల శ్రీసీతారామ ప్రసన్నాంజనేయ దేవాలయంలో సీతారాముల కల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో పెండ్లి కార్య్రక్రమం పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కుందూరు దామోదర్‌రెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

126
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...