ఎమ్మెల్యేలు నాకన్నా ఎక్కువగా పని చేశారు


Sun,April 14, 2019 02:39 AM

కరీమాబాద్, ఏప్రిల్ 13: పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, వారి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, నాయకులు నా కన్నా ఎక్కువగా పని చేశారని వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ అన్నారు. శనివారం శాంతినగర్‌లోని రాజశ్రీ గార్డెన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్యేల సహకారం మరువలేనిదన్నారు. పార్టీ నాయకులు, కమిటీల నాయకులు సైతం బాగా కష్టపడ్డారన్నారు. అందరి పనితీరుతో గతంలో కన్నా అధికంగా మెజారిటీ వస్తుందన్న నమ్మకముందన్నారు. దాదాపుగా 4 నియోజకవర్గాల్లో లక్షకు పైగా మెజారిటీ సాధిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచారన్నారు. టికెట్ కేటాయించిన కేసీఆర్‌కు, గెలుపుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ రుణపడి ఉంటానన్నారు. అభివృద్ధ్దిలో అండగా ఉంటానన్నారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ పరిధిలో తూర్పు నియోజకవర్గంలో అత్యధిక ఓటింగ్ నమోదైందన్నారు.

ఓటింగ్ శాతం పెరిగేందుకు సమష్టిగా కృషి చేశారన్నారు. తూర్పు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ అందిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రజాసంఘాలు, కుల సంఘాలు, కార్మాక సంఘాలు, వ్యాపార, వాణిజ్య తదితర సంఘాలు అండగా ఉన్నాయన్నారు. తూర్పులో ఉన్న నాయకులందరం ఐక్యతగా ముందుకు సాగామన్నారు. రానున్న రోజుల్లోనూ పార్టీ అభివృద్దికి ఐకమత్యంతో కలసి పని చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీమంత్రి బస్వరాజు సారయ్య, రాష్ట్ర మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ గుండు సుధారాణి, రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, మెట్టు శ్రీను, డాక్టర్ హరి రమాదేవి, చాంబర్‌ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి కార్పొరేటర్లు కేడల పద్మ, కత్తెరశాల వేణుగోపాల్, దామోదర్ యాదవ్, రాజేందర్, భిక్షపతి, నాగరాజు, బయ్య స్వామి, పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్, నాయకులు సిద్ధం రాజు, గుండేటి నరేంద్రకుమార్, మరుపల్ల రవి, మేడిది మధుసూదన్, పల్లం రవి, బాసాని శ్రీనివాస్, జబ్బార్, నాగపూరి సంజయ్‌బాబు, కంచి మనోహర్, ముష్కమల్ల సుధాకర్, పాల్గొన్నారు.

151
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...