కిక్ బాక్సింగ్‌లో సంతోషికి రజతం


Sat,April 13, 2019 03:13 AM

-అంతర్జాతీయ స్థాయిలో రాణింపు..
-ఘనంగా సన్మానించిన స్థానికులు
ఖిలావరంగల్, ఏప్రిల్ 12: అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో శంభునిపేట మదర్ థెరిసా స్కూల్‌లో 9వ తరగతి చ దువుతున్న ఎం సంతోషి రజత పతకం సాధించింది. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ గౌరిశంకర్ ఆధ్వర్యంలో సంతోషిని శుక్రవారం ప్రత్యేక వాహనంపై శివనగర్ నుంచి రంగశాయిపేట వరకు అభినందన ర్యాలీ నిర్వహించారు. కిక్ బాక్సిం గ్ పోటీల్లో ఇప్పటి వరకు సంతోషి ఐదు రాష్ట్ర స్థాయి, మూ డు జాతీయ స్థాయి, ఒక అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పా ల్గొని బంగారు, రజత పతకాలు సాధించింది. కాగా ఈ నెల 4 నుంచి 7 వరకు యూరప్, టర్కీలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని రజత పతకం సాధించింది. 37 దేశాలకు చెందిన 2700 మంది క్రీడాకారులు పాల్గొనగా భారత్ తరపున 17 మంది క్రీడాకారులు బరిలో నిలువగా 9 మంది క్రీ డాకారులు పతకాలు సాధించి ఇండియాను ఏడో స్థానంలో నిలబెట్టారు. ఇందులో ఏడుగురు తెలంగాణ క్రీడాకారులు కావడం విశేషం. పాఠశాల యాజమాన్యం గౌరిశంకర్, అరు ణ, కోచ్, వరంగల్ కిక్ బాక్సింగ్ అధ్యక్షుడు సిరిగిరి తిరుపతి, బండారి సంతోష్, నరేందర్ సంతోషిని అభినందించారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...