ఫిర్యాదు చేయడానికి వెళ్తే చితక బాదారు..!?


Sat,April 13, 2019 03:12 AM

ఖిలావరంగల్, ఏప్రిల్ 12: దాడి చేసి బంగారు ఆభరణాలు, డబ్బులు లాక్కున్నారని ఓ బాధితుడు ఫిర్యాదు చేయడం కోసం ఠాణాకు వెళ్లాడు. ఎక్కడ..ఎప్పుడు..ఎలా జరిగింది.. అని ప్రశ్నించకుండానే ఎస్సై బాధితుడిపై విరుచకపడ్డారు. బాధితుడిపై లాఠీ ఝుళిపించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతన్ని కుటుంబ సభ్యులు వెంటనే ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఠాణాకు వచ్చిన ప్రతీ ఒక్కరిని కూర్చోబెట్టి మాట్లాడి ఫిర్యాదు స్వీకరించి సంబంధిత వ్యక్తులపై చర్యలు చేపట్టాలని పోలీసు బాస్‌లు సూచిస్తున్నా కొంత మంది పోలీసులు, ఓ స్థాయి అధికారులు పెడచెవిన పెడుతున్నారనడానికి గురువారం రాత్రి వరంగల్ మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. శివనగర్‌కు చెందిన రాజు కారు డ్రైవర్‌గా విధులు ముగించుకొని ఇంటికి వస్తున్నాడు. ఏసిరెడ్డినగర్ నుంచి వస్తున్న క్రమంలో ఎస్సీ కాలనీ వద్ద గొడవ జరుగుతోంది. ఎందుకు గొడవ జరుగుతుందని అక్కడే ఉన్న తన మిత్రుడు సంగి నాగేందర్‌ను అడుగుతున్న క్రమంలో పరస్పర దాడులు చేసుకుంటున్న సతీశ్‌తోపాటు మరికొంత మంది హఠాత్తుగా తనపై దాడికి దిగినట్లు బాధితుడు రాజు ఆరోపించాడు. ఈ దాడిలో తన మెడలోని మూడు తులాల బంగారు గొలుసు, రెండు బంగారం ఉంగరాలు, జేబులోని రూ.5వేలు లాక్కున్నారని ఆరోపించాడు. ఇదే విషయంపై లిఖిత పూర్వంగా ఫిర్యాదు చేసేందుకు మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్‌కు వెళ్లినట్లు బాధితుడు చెప్పాడు. అయితే ఫిర్యాదును పరిశీలించకుండానే ఓ ఎస్సై లాఠీతో తనను తీవ్రంగా కొట్టి బయటకు పంపించాడని రాజు ఆరోపిం చాడు. కాగా, గాయపడిన రాజును కుటుంబ సభ్యులు ఎంజీఎం దవాఖానకు తరలించి చికిత్స చేయించారు.

విచారణ చేపడుతాం : సీఐ
ఈ కేసులో ఇరువర్గాల నుంచి వివరాలు సేకరిస్తామని మిల్స్‌కాలనీ సీఐ సత్యనారాయణ తెలిపారు. జరిగిన ఘటనపై ఆయన వివరణ కోరగా... పోలీస్ స్టేషన్ ముందు పరస్పర దాడులు చేసుకుంటున్న క్రమంలో చెదరగొట్టే ప్రయత్నం చేశామని వివరించారు. ఇందులో ఎవరివైపు నుంచి తప్పు ఉన్నా అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...