ఓటర్ల లెక్క తేలింది..!


Tue,March 26, 2019 01:44 AM

- వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొత్త ఓటర్లు 39,975
- మహబూబాబాద్‌లో 36,401
- ఓటర్లలో అత్యధికులు మహిళలే..

వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటర్ల లెక్కతేలింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు రేపు ఏప్రిల్ 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల మధ్య కొత్త ఓటర్లు అనూహ్యంగా పెరిగారు. మహబూబాబాద్, వరంగల్ ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు 19462 మంది అదికంగా ఉంటే, వరంగల్ పార్లమెంట్ పరిధిలో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు 8,139 మంది ఉన్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఓటర్లు 16లక్షల 66వేల 85 మంది. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 14లక్షల 23వేల 351 మంది ఓటర్లు ఉన్నారు. వరంగల్ లోకసభ పరిధిలో పురుష ఓటర్లు 8లక్షల 28వేల 882 మంది కాగా, మహిళా ఓటర్లు 8 లక్షల 37వేల 21. అదే మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో పురుష ఓటర్లు 7 లక్షల ఒక వెయ్యి 921 మందికాగా, 7లక్షల 21వెయ్యి 383 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ వరంగల్ పార్లమెంట్ పరిధిలో ట్రాన్స్‌జెండర్ ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకర్గం వరంగల్ తూర్పు కావడం విశేషం. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలిలా ఉన్నాయి.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...