స్వతంత్రుల గుర్తులివే..


Tue,March 26, 2019 01:42 AM

జయశంకర్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ: లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే చిహ్నాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఈ మేరకు 198 చిహ్నాలతో జాబితా విడుదల చేసింది. వీటిలో నాలుగు చిహ్నాలను తెలుగు రాష్ర్టాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మినహాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నాలుగు చిహ్నాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు భారీ నష్టం కలిగించిన ట్రక్కు గుర్తు ఉండటం విశేషం. ట్రక్కుతో పాటు ఆటో రిక్షా, టోపి, ఇస్త్రి పెట్టె గుర్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో మినహా దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల అధికారులు కేటాయించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన 198 చిహ్నాల్లో తెలంగాణ రాష్ట్రంలో నాలుగింటిని మినహాయిస్తే ఇతర 194 గుర్తులను ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు అక్షరమాల ప్రకారం ఎన్నికల అధికారులు కేటాయించనున్నారు. గత డిసెంబర్‌లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు అధికారులు కేటాయించిన గుర్తుల్లో ట్రక్కు చిహ్నం ఉంది. ట్రక్కు చిహ్నం కారు గుర్తును పోలి ఉండడం వల్ల తమ పార్టీ అభ్యర్థులకు పడాల్సిన కొన్ని ఓట్లు ట్రక్కు గుర్తుతో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులకు పడ్డాయని, దీంతో కొన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందాల్సిన తమ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారని టీఆర్‌ఎస్ ఇటీవల ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడానికి నిర్ణయించిన 198 చిహ్నాల్లో ట్రక్కుతోపాటు ఆటో రిక్షా, టోపి, ఇస్త్రి పెట్టె గుర్తులను కూడా తెలంగాణ రాష్ట్రంలో మినహాయించాలని అధికారులను ఆదేశిస్తూ తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు.

స్వతంత్ర చిహ్నాల జాబితా
1 ఎయిర్ కండీషనర్, 2 బీరువా, 3 ఆపిల్, 4 ఆటో రిక్షా (ఏపీ, తెలంగాణ మినహా మిగతా అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో), 5 బేబీ వాకర్, 6 బుడగ,7గాజులు, 8 పండ్ల బుట్ట, 9 బ్యాట్, 10 బ్యాట్స్‌మేన్, 11 టార్చ్‌లైట్, 12 పూసల నెక్లెస్, 13 బెల్ట్, 14 బెంచ్,15 సైకిల్ గాలి పంపు,16 బైనాక్యూలర్స్, 17 బిస్కెట్టు, 18 బ్లాక్ బోర్డ్, 19 మనిషితోకూడిన తెరచాపతో పడవ, 20 సీసా, 21 పెట్టె, 22 రొట్టె, 23బ్రెడ్ టోస్టర్, 24 ఇటుకలు, 25బ్రీఫ్‌కేసు, 26బ్రష్, 27బకెట్, 8 కేక్, 29 కాలిక్యులేటర్, 30 కెమెరా, 31 క్యాన్, 32 బెంగళూరు మిర్చి (క్యాప్సికమ్), 33 తివాసి (కార్పెట్), 34 క్యారమ్‌బోర్డు, 35 గోబి పువ్వు, 36 సిసి టీవీ కెమెరా, 37 గొలుసు, 38 తిరగలి (ఇనుప రాయి), 39 చపాతి రోలర్, 40 పాద రక్షలు, 41 చదరంగ పట్టి, 42 పొగ గొట్టం, 43 క్లిప్పు, 44 కోటు, 45 కొబ్బరి తోట, 46 రంగుల ట్రే మరియు బ్రష్, 47 కంప్యూటర్, 48 కంప్యూటర్ మౌస్, 49 మంచం, 50 క్రేన్, 51 ఘనము (క్యూబ్), 52 కప్పు & సాసర్, 53 కటింగ్ ప్లేయర్, 54 వజ్రము, 55 డీజిల్ పంపు, 56 డిష్ యాంటెనా, 57 డోలి, 58 డోర్ బెల్, 59 డోర్ హ్యాండిల్, 60 డ్రిల్ మెషిన్, 61 డంబెల్స్, 62 చెవి రింగులు, 63 విద్యుత్ స్తంభము, 64 కవరు, 65 ఎక్సటెన్షన్ బోర్డు, 66 పిల్లన గ్రోవి, 67 ఫుట్‌బాల్, 68 ఫుట్‌బాల్ ఆటగాడు, 69 ఫౌంటెన్, 70 గౌను, 71 మూకుడు (ఫ్రయింగ్ పాన్), 72 గరాటు, 73 గన్నా కిసాన్, 74 గ్యాస్ సిలిండర్, 75 గ్యాస్ స్టౌ, 76 గిఫ్టు ప్యాక్, 77 అల్లం, 78 గాజు గ్లాసు, 79 గ్రామోఫోన్, 80 ద్రాక్ష గుత్తి, 81 పచ్చి మిరపకాయ, 82 తోపుడు బండి, 83 హార్మోనియం,

84 టోపి (ఏపీ, తెలంగాణ మినహా మిగతా అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో), 85 హెడ్‌ఫోన్, 86 హెలికాప్టర్, 87 హెల్మెట్, 88 హాకీ అండ్ బాల్, 89 హవర్ గ్లాసు, 90 ఐస్ క్రీం, 91 ఇమ్మర్షన్ రాడ్ (వాటర్ హాటర్), 92 ఇస్త్రిపెట్టె (ఏపీ, తెలంగాణ మినహా మిగతా అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో), 93 పనసకాయ, 94 కేటిల్, 95 తాళంచెవి, 96 కిచెన్ సింక్, 97 బెండకాయ, 98 లేడి పర్సు, 99 ల్యాప్‌టాప్, 100 గొళ్లెం, 101 లెటర్ బాక్సు, 102 లైటర్, 103 లూడో, 104 లంచ్ బాక్సు, 105 తురా ఊదుతున్న మనిషి, 106 అగ్గిపెట్టె, 107 మైకు, 108 మిక్సి, 109 నెయిల్ కట్టర్, 110 నెక్ టై, 111 నూడుల్స్ గిన్నె, 112 కడాయి, 113 ప్యాంటు, 114 వేరు శెనగలు, 115 బేరిపండ్లు (పియర్స్), 116 బఠాణీలు, 117 పెన్ డ్రైవ్, 118 ఏడు కిరణాలతో కూడిన పెన్ను పాళీ, 119 పెన్ను స్టాండు, 120 పెన్సిల్ బాక్సు, 121 పెన్సిల్ షార్పెనర్, 122 పెండ్యులం, 123 కల్వము, రోకలి, 124 పెట్రోల్ పంపు, 125 ఫోన్ చార్జర్, 126 దిండు, 127 అనాసపండు, 128 ప్లాస్టరింగ్ ట్రోవెల్, 129 ఆహారంతో కూడిన పళ్లెం, 130 పళ్లెం స్టాండు, 131 కుండ, 132 ప్రెషర్ కుక్కర్, 133 పంచింగ్ మెషీన్, 134 రేజర్, 135 రిఫ్రిజిరేటర్, 136 ఉంగరం, 137 రోడ్ రోలర్, 138 రోబొట్, 139 రూమ్ కూలర్, 140 రూమ్ హీటర్,141 రబ్బర్ స్టాంప్, 142 సేఫ్టీ పిన్సీసు, 143 రంపు, 144 స్కూలు బ్యాగ్, 145 కత్తెర, 146 కుట్టు మిషన్, 147 ఓడ, 148 బూటు, 149 షట్టర్, 150 సితార, 151 స్కిప్పింగ్ తాడు, 152 పలక, 153 సబ్బు పెట్టె, 154 మేజోళ్లు (సాక్స్), 155 సోఫా, 156 స్పానర్, 157 స్టేప్‌లర్, 158 స్టెతస్కోపు, 159 స్టూలు, 160 స్టంప్స్, 161 ఊయల, 162 స్విచ్ బోర్డు, 163 సిరంజి, 164 టీవీ రిమోట్, 165 మేజాబల్ల (టేబుల్), 166 టీ ఫిట్టర్, 167 టెలిఫోన్, 168 టిలివిజన్, 169 టెన్నిస్ రాకెట్, బంతి, 170 గుడారం (టెంట్), 171 జూవేలిన్ విసరడం, 172 నాగలి (టిల్లర్), 173 చాక్లెట్లు, 174 పటకారు, 175 టూత్‌బ్రష్, 176 టూత్ పేస్టు, 177 ట్రాక్టర్ నడిపే రైతు, 178 ట్రే, 179 త్రిభుజం, 180 ట్రక్కు (ఏపీ, తెలంగాణ మినహా మిగతా అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో), 181 ట్రంఫెట్, 182 ట్యూబ్‌లైట్, 183 టైప్ రైటర్, 184 టైర్లు, 185 వ్యాక్యూమ్ క్లీనర్, 186 వయోలిన్, 187 చేతికర్ర, 188 వాల్ హుక్, 189 పర్సు, 190 వాల్‌నట్, 191 పుచ్చకాయ, 192 వాటర్ ట్యాంక్, 193 బావి, 194 వీల్ బారో, 195 ఈల, 196 కిటికి, 197 చేట, 198 ఉన్ని సూది.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...