సీఎం సభకు ముమ్మర ఏర్పాట్లు


Tue,March 26, 2019 01:42 AM

మిల్స్‌కాలనీ, మార్చి 25: పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వచ్చేనెల 2వతేదీన వరంగల్‌లోని 11వ డివిజన్ ఓసిటీ మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఓసిటీలోని సభాస్థలిని సోమవారం సందర్శించారు. అనంతరం ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. ఓసిటీలో ఇటీవల పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభినందన సభతో పాటు, టీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలు విజయవంతమయ్యాయి. అదేతరహాలో సీఎం కేసీఆర్ ఏప్రిల్ 2న ఓసిటీ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీ ఏర్పాట్లకు ఎమ్మెల్యే నరేందర్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే నర్సంపేట రోడ్డుకు రాంఖీ వెనకభాగంలో పొక్లెయినర్లతో చదును చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ 2వ తేదీన సీఎం కేసీఆర్ బహిరంగ సభను పెద్దఎత్తున విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి 2లక్షలమందికి పైగా సభకు హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో 16స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపు తథ్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్‌చార్జి సాంబారి సమ్మారావు, కార్పొరేటర్లు బయ్యా స్వామి, కుందారపు రాజేందర్, టీఆర్‌ఎస్ నేతలు గుండేటి నరేందర్, వస్కుల బాబు, ఎండీ చాంద్‌పాషా, వీరగోని మనోహర్ ఉన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...