విధుల్లో రాణిస్తూనే ప్రజలకు చేరువకావాలి


Tue,March 26, 2019 01:42 AM

రెడ్డికాలనీ, మార్చి 25: తమకు అప్పగించిన వర్టికల్స్ విధుల్లో రాణించడంతో పాటు ప్రజలకు మరింత చేరువ కావాల్సి ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ అన్నారు. పోలీస్‌స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపర్చడంతో పాటు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు గాను 15వ వర్టికల్స్‌ను అనుసరించి పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించే విధులను 15 విభాగాలుగా విభజించి ఒక్కొక్క విభాగానికి ఇన్‌స్పెక్టర్‌స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి అధికారులను బాధ్యులను చేయడం జరిగిందన్నారు. ఈ విధంగా వర్టికల్స్ విధానంలో విభాగాల వారీగా చక్కగా రాణిస్తూ తమ ప్రతిభను కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రతీ నెలా పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా రివార్డులు అందజేయడం జరిగిందన్నారు. వర్టికల్స్ విధానంలో ప్రతిభ కనబరిచి రివార్డులు అందుకున్నవారిలో ఇన్‌స్పెక్టర్లు ఎస్‌వీ రాఘవేందర్‌రావు, పి.మహేందర్, సబ్‌ఇన్‌స్పెక్టర్లు ఏ.ప్రవీణ్‌కుమార్, అబ్దుల్ రహీం, కె.కు మారస్వామి, జె.లక్ష్మణ్‌రావు, ఏఎస్సై జి. సాం బ య్య, హెడ్‌కానిస్టేబుళ్లు జి.తాతరావు, ఎం.విజయసేనారెడ్డి, కె.లక్ష్మీనారాయణ, కానిస్టేబుళ్లు వి.దామోదర్, ఎన్. సురేష్, ఎన్. నరేందర్, ఎం.నవీన్‌కుమార్, వి. శ్యాం, ఏ.శ్రీ ను, ఈ.వెంకన్న, పి. అశోక్, పి.నాగరాజు, కె. రమే ష్, పి.వేణు, వి. మహేందర్, పి. నరేష్, సదానందం, సురేష్, సీహెచ్.రాజు, జి.రవికుమార్, ఎండి.అంకూస్‌అలీ, పి.సౌజన్య, జె.శ్రీలత, హోంగార్డ్స్ మాలతీరెడ్డి, కృష్ణ, సంతోష్, సత్యం, అశోక్‌కుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అధికారులు అప్పగించిన విధులను బాధ్యతతో నిర్వర్తించడం ద్వారా పోలీస్‌స్టేసన్ల పనితీరులో మరింత మెరుగైన ఫలితాలు తీసుకురావడంతో పాటు, ప్రజలు పోలీసుల పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వెస్ట్‌జోన్ డీసీపీ బి.వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...