రగ్బీలో సుమన్‌కు గోల్డ్‌మెడల్..


Tue,March 26, 2019 01:42 AM

ధర్మసాగర్, మార్చి 25 : మండల కేంద్రానికి చెందిన గజ్జల సుమన్‌కు రగ్బీ ఆటలో గోల్డ్‌మెడల్ సాధించారని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ధర్మసాగర్ ప్రిన్సిపాల్ స్వర్ణలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు అమ్మనాన్నల హల్‌చల్ సమ్మర్ సమూరాయ్ పేరెంట్స్ క్యాంపు పేరిట చెస్, క్యారమ్స్, రూబిక్స్ క్యూబ్, బ్యాడ్మింటన్, అబాకస్, రగ్బీ క్రీడా పోటీలు నిర్వహించారు. ధర్మసాగర్ గురుకుల బాలికల పాఠశాల నుంచి 5వ తరగతి చదువుతున్న గజ్జల శిరీష తండ్రి సుమన్ జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్ని ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొని గోల్డ్‌మెడల్ సాధించినట్లు తెలిపారు. షటిల్‌లో ప్రశంసా పత్రం అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 300 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పోటీల్లో పాల్గొన్న సుమన్ గోల్డ్‌మెడల్ సాధించి గురుకుల పాఠశాల రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ స్వర్ణలత, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆయనను అభినందించారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...