దైవచింతనతోనే మానసిక ప్రశాంతత


Tue,March 26, 2019 01:42 AM

ఐనవోలు మార్చి 25 : దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని నందనంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవం కంఠమహేశ్వర సూరమాంబల కల్యాణ మహోత్సవం, రేణుకా ఎల్లమ్మ బోనాల కార్యక్రమానికి ఎంపీపీ మార్నేని రవీందర్‌రావులతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు గౌడ కులస్తులతో కలిసి కంఠమాహేశ్వరస్వామి, రేణుకాదేవిలను దర్శంచుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం గౌడ కులస్తులు ఎమ్మెల్యేను, ఎంపీపీని ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయన్నారు. ఉమ్మడిగా దైవ కార్యక్రమాలు చేసే సమయంలోనే అందరిలో ఐకమత్యం దృఢంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మునిగాల సంపత్‌కుమార్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరిగౌడ్, సొసైటీ చైర్మన్ బుర్ర రాజ్‌కుమార్, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, సర్పంచులు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, మండల అధికార ప్రతినిధి మిద్దెపాక రవీందర్, నాయకులు చందర్‌రావు, సింగారం రాజు, బుర్ర రాజశేఖర్, సత్యం, నాగయ్య, దేవాదాసు పాల్గొన్నారు.

పంటలకు సాగు నీరు అందించాలని ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి సౌత్ కెనాల్ ద్వారా నియోజకవర్గంలోని రైతులకు సాగు నీరు అందించాలని దేవాదుల అధికారులను ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆదేశించారు. సోమవారం మండలంలోని సింగారం సమీపంలోని కోట గండి, కొండపర్తి సమీపంలోని కెనాల్ కాలువలను పరిశీలించి గుండ నీరు ప్రవహించకుండా ఉన్న సమస్యల గుర్తించారు. ఈ అడ్డంకులను వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. వేసవి కాలం రైతులకు పంట సాగుకు కోసం నీటిని వెంటనే విడుదల చేసిన ఏ రైతుకు కూడా ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలన్నారు. ఆయన వెంట దేవాదుల ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా యువజన నాయకుడు ఇండ్ల నాగేశ్వర్‌రావు, నాయకులు పిట్టల కుమారస్వామి, కట్కూరి బెన్‌సన్, పిట్టల సుధీర్, దేవాదులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...