2న ఏజే మిల్లు మైదానంలో కేసీఆర్ సభ


Mon,March 25, 2019 03:26 AM

- సీఎం సభకు 2 లక్షల మంది సమీకరణ
- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడి
- మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశం
- ఒక్కో నియోజకవర్గం నుంచి 30 వేల మందిని తరలించాలని పిలుపు

రెడ్డికాలనీ, మార్చి 24: వరంగల్ పార్లమెంట్ పరిధిలోని వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో (ఆ జంజాహి మిల్లు గ్రౌండ్) ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లతో ఆదివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. సమావేశంలో సభా ఏర్పాట్లు, జనసమీకరణ తదితర అంశాలపై చర్చించారు. రెండు లక్షల మందితో సభను విజయవంతం చేయాలన్నారు. ఇందుకోసం ప్రతీ నియోజకవర్గం నుంచి 30 వేల మందిని తరలించాలని మంత్రి పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ ఎంపీ గుండు సుధారాణి, చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, లింగంపల్లి కిషన్‌రావు, పార్టీ ఎన్నికల ఇన్‌చార్జీలు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కన్నెబోయిన రాజయ్య యాదవ్, మెట్టు శ్రీనివాస్, జన్ను జకార్య, సాంబారి సమ్మారావు, పులి సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...