31న గురుకులాల్లో ఇంటర్ ప్రవేశ పరీక్ష


Mon,March 25, 2019 03:14 AM

మడికొండ, మార్చి24: ఐఐటీ గౌలిదొడ్డి, సీవోఈ గురుకుల ఇంటర్మీడియేట్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఈ నెల 31వ తేదీన రెండోస్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు గురుకులాల జిల్లా కో-ఆర్డినేటర్ దాసరి ఉమామహేశ్వరి తెలిపారు.

2019-20 విద్యా సంవత్సరానికి గత నెల ఫిబ్రవరి 17న మొదటిస్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించగా 31న రెండోస్థాయిలో చేపడుతున్నట్లు ఆమె చెప్పారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు గురుకుల వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇందులో అర్హత సాధించిన వి ద్యార్థులు గౌలిదొడ్డిలోని ఐఐటీ కళాశాల, సీవోఈ కళాశాలల్లో ప్రవేశాలు లభిస్తాయని అన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...