రైలు మారింది..రూట్ మిస్సయింది


Mon,March 25, 2019 03:12 AM

- వెళ్లాల్సిన రైలుకు బదులు మరో రైలు ఎక్కిన బాలుడు
- కాజీపేట జంక్షన్‌లో గుర్తించిన జీఆర్పీ సిబ్బంది
- చైల్డ్‌లైన్‌కు అప్పగింత

కాజీపేట: ఊరికి వెళ్లాల్సిన రైలు ఎక్కబోయి మరోరైలు ఎక్కి వచ్చిన బాలుడిని కాజీపేట రైల్వేస్టేషన్‌లో ఆదివారం జీఆర్పీ పోలీసులు చేరదీసి చైల్డ్‌లైన్‌కు అప్పగించారు. కాజీపేట జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లా, పాండవపూర్ మండల్, దొడ్డకేటన్లీ గ్రామానికి చెందిన మంజగౌడ్ చేతన్ (14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

శనివారం రాత్రి యశ్వంతపూర్‌కు వెళ్లే రైలుకు బదులుగా ఢిల్లీ వైపునకు వెళ్లే కర్ణాటక సంపర్క్ క్రాంతి రైలు ఎక్కినట్లు తెలిపారు. కాజీపేట రైల్వే జంక్షన్‌లో దిగి ఏడుస్తుండగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న జీఆర్పీ కానిస్టేబుల్ అశోక్ చేరదీసి స్టేషన్‌కు తరలించి పూర్తి సమాచారాన్ని సేకరించారు.

మంజగౌడ్ చేతన్ తెలిపిన సమాచారంతో కర్ణాటక రాష్ట్రంలోని కార్పెట్ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం చేరవేసి తల్లిదండ్రులకు విషయం చెప్పినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి బాలుడిని చైల్డ్‌లైన్ 1098 బృందం సభ్యుడు పీ విజయ్‌కుమార్‌కు అప్పగించామని తెలిపారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...