విద్యుదాఘాతంతో రైతు మృతి


Mon,March 25, 2019 03:10 AM

భార్య, బావమరిదికి గాయాలు
కమలాపూర్: మండలంలోని వంగపల్లి గ్రామం లో విద్యుత్‌షాక్‌తో రైతు మృతి చెందిన విషాదఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై సందీప్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..కొడెపాక పోచయ్య (48) వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చి కాళ్లు చేతులు కడుక్కొని ఇంటి మెట్ల ఇనుప చువ్వలపై ఉన్న టవల్ తీస్తుండగా కరంటు షాక్ వచ్చి కిందపడిపోయాడు. గమనించిన భార్య తిరుపతమ్మ భర్తను పక్కకు లాగేందుకు ప్రయత్నించగా.. ఆమె సైతం విద్యుదాఘాతానికి గురైంది.

అక్కడే ఉన్న పోచయ్య బావమరిది ఆకునూరి విజయ్ వారిద్దరిని కాపాడేందుకు ప్రయత్నించగా అతడికి సైతం కరంట్ షాక్ తగిలింది. విషయం గ్రామస్తులకు తెలియడంతో వారు వచ్చి ఇంట్లో కరంటు సరఫరాను నిలిపివేసి బాధితులను దవాఖానకు తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే పోచయ్య మృతి చెందాడు.

పోచయ్య భార్య తిరుపతమ్మ, బావమరిది విజయ్‌కు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స చేయించగా ప్రమాదం నుంచి బయటపడినట్లు చెప్పారు. అయితే ఇనుప చువ్వలకు విద్యుత్ సరఫరా కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...