విధుల్లో ఉన్న కార్మికుడి మృతి


Mon,March 25, 2019 03:08 AM

- కంపెనీ తీరుపై బంధువుల ఆందోళన
- ఘటన స్థలాన్ని పరిశీలించిన ఇన్‌స్పెక్టర్
- సదురు కంపెనీ నిర్వహణపై ఆగ్రహం

హసన్‌పర్తి, మార్చి 24: మండలంలోని ఎల్లాపూర్ శివారులోని ఓ కాంక్రీట్ వర్క్స్ కంపెనీలో ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందిన విషాద ఘటన శనివారం రాత్రి 11 గంటలకు చోటుచేసుకుంది. ఈఘటనను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నం చేయగా..బంధువులు యాజమాన్యంపై మండిపడ్డారు.

పోలీసులు, మృతుడు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేటకు చెందిన బైరి శ్రీనివాస్‌కు భార్య ముగ్గురు కూతుళ్లు. శ్రీనివాస్ 25 ఏళ్లుగా లక్ష్మి ప్రెస్టర్స్ కాంక్రీట్ వర్క్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ (ఎల్‌పీసీ)లో కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

ఎప్పటిలాగే శ్రీనివాస్ రాత్రి షిఫ్టులో కంపెనీలో విధులు నిర్వహిస్తుండగా హైటెన్షన్ స్టీల్ వైర్ బండిల్ మిషన్ నుంచి జారీ అతడిపై పడడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో శ్రీనివాస్‌ను నగరంలోని ఓ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుడి భార్య దేవికతో పాటు ముగ్గురు కూతుళ్లు, కుటుంబ సభ్యులు, బంధువులు ఎల్లాపూర్ శివారు కంపెనీకి చేరుకొని ఆందోళన చేపట్టారు. తన భర్త చావుకు కంపెనీ యాజమాన్యమే కారణమంటూ ఆందోళన చేపట్టారు. సమారు రెండు గంటల పాటు కంపెనీ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

విషయం తెలియడంతో ఇన్‌స్పెక్టర్ తిరుమల్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కంపెనీలో కార్మికుల కోసం ఎటువంటి భద్రత ఏర్పాట్లు కానీ, కంపెనీ నిర్వహణ, రికార్డులు లేకపోవడం గమనించి యాజమాన్యంపై మండిపడ్డారు. కొద్దిసేపు పోలీసులు, కంపెనీ యజమాన్యంతో మృతుడి బంధువులు వాగ్వాదానికి దిగారు.

కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. దీంతో ఇన్‌స్పెక్టర్ తిరుమల్, ఎస్సై రవీందర్ ఆందోళనకారులను శాంతిపజేసి మృతుని కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మృతుడి భార్య దేవిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తిరుమల్ తెలిపారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...