సామాజిక ఉద్యమాల్లో పాల్గొనాలి


Mon,March 25, 2019 03:01 AM

ధర్మసాగర్, మార్చి 24 : భారత రాజ్యంగ నిర్మాత డా. అంబేద్కర్, ఫూలే ఆశయాలను లక్ష్యాలను ముందుతీసుకెళ్లడంతో సామాజిక ఉద్యమాల్లో పాల్గొనాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ అన్నారు. వేలేరు మండల కేంద్రంలో ఆదివారం కేవీపీఎస్ మండల స్థాయి సమావేశంలో చిలుక రాఘవులు అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవివక్షత కోసం దశలవారిగా చేపట్టే ఉద్యమాల్లో పాల్గొన్నాలని, వచ్చే నెలలో డాక్టర్ అంబేద్కర్ 128వ జయంతిని పురస్కరించుకోని జిల్లా వ్యాప్తంగా చేపట్టబోయే అంబేడ్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకపోవడంలో ఉద్యమస్వభావం కలిగిన వారందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, ఉపేందర్, రాఘవులు, నరేశ్, రాజు, ధర్మేందర్, వేణు, ప్రసాద్ తదితులు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...