ఎంపీ పసునూరికి అభినందనల వెల్లువ


Mon,March 25, 2019 02:56 AM

భారీ మెజార్టీతో గెలుపు ఖాయమంటున్న టీఆర్‌ఎస్ శ్రేణులు

మడికొండ, మార్చి 24: వరంగల్ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను మడికొండ టీఆర్‌ఎస్ నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన్ను కలిసిన వారిలో మెట్టుగుట్ట చైర్మన్ అల్లం శ్రీనివాసరావు, నాయకులు ఆవాల రాధికారెడ్డి, తండ శంకర్, బుర్ర రాజ్‌కుమార్, భిక్షపతి, మాచర్ల శ్రీధర్, కిరణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీని కలిసిన సాక్షర భారత్ కమిటీ సభ్యులు
ధర్మసాగర్ : వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను సాక్షరభారత్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు బెల్లెపాక రాజేశ్, జిల్లా అధ్యక్షుడు ముల్క సత్యనారాయణ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పడ్న లిక్నాగా పేరు మార్చి రానున్న కొత్త ప్రభుత్వంలో అమలు చేయాలని కోరారు. రాష్ట్ర కమిటీ టీఆర్‌ఎస్ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ దయాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దృష్టికి సమస్యలను తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు స్వామి, రాజు, రవీందర్ తదితరులు ఉన్నారు.

-దర్గాలో పూజలు
హన్మకొండ రూరల్ : వరంగల్ ఎంపీగా పసునూరి దయాకర్ అత్యధిక మెజార్టీతో గెలవాలని పైడిపల్లిలోని నూరుద్దీన్ ఖాద్రీబాబా దర్గా పీఠాధిపతి అంకుషావళి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేసీఆర్ యువసేన నాయకుడు ల్యాదల్ల రమేశ్ పాల్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మోసిన్, జన్ను మోహన్, ఐత శ్రీధర్, తూముల సదానందం, ఏలుకొండ ప్రతాప్, జన్ను శేఖర్ పాల్గొన్నారు.

-దయాకర్‌ను కలిసిన టీఆర్‌ఎస్ నాయకులు
టీఆర్‌ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ టీఆర్‌ఎస్ నాయకులు ఎంపీ నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీగా దయాకర్ చేసిన సేవలను గుర్తించి కేసీఆర్ మళ్లీ అవకాశం కల్పించారని, అత్యధిక మెజార్టీతో దయాకర్‌ను గెలిపించి కేసీఆర్ రుణం తీర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోనె రవీందర్, తెలంగాణ గ్రాడ్యూయేట్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్ను సారంగపాణి, సంజీవ, అహ్మద్‌పాషా, రఘు, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...