గోవిందా.. గోవిందా!


Sun,March 24, 2019 02:13 AM

హసన్‌పర్తి, మార్చి 23: ఎర్రగట్టు వేంకటేశ్వరస్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి ప్రీతికరమైన శనివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలినవారు స్వామివారిని దర్శించుకున్నారు. ఏడుకొండల వాడా.. వెంకటరమణా.. ఆపదమొక్కుల వాడా.. అ నాథ రక్షకా గోవిందా గోవిందా.. అంటూ పూజలు చేశారు. ఆలయ పూజారులు అర్చనలు, అభిషేకాలు నిర్వహించా రు. ఉత్సవ కమిటీ చైర్మన్ అటికం రవీందర్‌గౌడ్, ఈవో వేణుగోపాల్ సమక్షంలో పూజారులు వేదాంతం పార్థసారదాచార్యులు, ఆరుట్ల శ్రీనివాసచార్యులు స్వామివారికి విశేషపూజ, కుంకుమార్చనలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, గర్భగుడిలో ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసి పూజలు చేశారు. ఆలయ ధర్మకర్తలు నలిగేటి అనిల్‌కుమార్‌యాదవ్, జక్కుల రాధాకృష్ణ, గౌరిశెట్టి కృష్ణమూర్తి, పాడి గణపతిరెడ్డితో పాటు ఆలయ సిబ్బంది సంజీ వ్, శ్రీనివాస్, రామకృష్ణ, పవన్, ఆరూరి దండు స్వచ్ఛంద సేవకులు, వలంటీర్లు పాల్గొన్నారు.

ప్రముఖుల ప్రత్యేక పూజలు
స్వామివారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, దేవాదా య శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు, ధర్మకర్తలు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శనివారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

మూడో రోజు మహాన్నదానం
జాతర ప్రాంగణంలోని టీటీడీ కల్యాణ మండపంలో మూడో రోజు విశ్వక్‌సేన సేవా సమితి ఆధ్వర్యంలో మహాన్నదానం నిర్వహించారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని విశ్వక్‌సేనా సేవా సమితి అధ్యక్షుడు పీ వెంకటేశం ప్రారంభించారు. వెంకన్న ఆలయ అభివృద్ధికి భక్తులు తోచిన విధంగా సహాయం అందించి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శులు సట్కూరి సంతోశ్‌రాజ్, కోశాధికారి శీలం పృథ్వీరాజ్, సభ్యులు పావుశెట్టి సాంబయ్య, కందుకూరి కృష్ణమూర్తి, తోట నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఎర్రగట్టు జాతర అభివృద్ధికి కృషి
దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఎర్రగట్టు వెంకన్న జాతరలో అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వ హించిన ఆయన గండ దీపానికి నూనె పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకన్న స్వామి ఆలయ ప్రాంగణంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు, రూ.7లక్షలతో సెంట్రల్ లైటింగ్‌కు నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. జాతర అభివృద్ధికి సీ డీఎఫ్ నిధులు కేటాయించి మరిన్ని పనులకు శ్రీకారం చు డతానన్నారు. కార్పొరేటర్లు జక్కు వెంకటేశ్వర్లుయాదవ్, రా జునాయక్, ఆలయ చైర్మన్ అటికం రవీందర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బండి రజనీకుమార్, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ విజయ్‌కుమార్, ధర్మకర్తలు అనిల్‌కుమార్‌యాదవ్, గణపతిరెడ్డి, ఈవో వేణుగోపాల్, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ సంజీవరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...