హృదయాన్ని కొవ్వొత్తిలా వెలిగించాలి


Fri,March 22, 2019 03:16 AM

రెడ్డికాలనీ, మార్చి 21: దొడ్డి కొమురయ్య ఫౌండేషన్, షైన్ విద్యాసంస్థ సంయుక్తంగా హన్మకొండలోని రాజరాజనరేంద్రాంధ్ర భాషా నిలయంలో ప్రపంచ కవిత దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కవి దామోదర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రముఖ కవి అన్వర్ పాల్గొని కవిత్వరచనా మెళకువల గురించి ప్రసంగించారు. హృదయాన్ని కొవ్వొత్తిగా వెలిగించి, సమాజ చీకట్లను పారద్రోలాలనే తపన నరనరాల్లో, రక్తంలో ప్రవహించినప్పుడే నిఖర్సైన కవిత్వం జన్మిస్తుందన్నారు. నిగూఢత, స్పష్టత, చక్కని పత్రీకలు ఉన్నప్పుడే గుణాత్మక కవిత్వం నిర్మితమవుతుందన్నారు. ఫౌండేషన్ అధ్యక్షుడు అస్నాల శ్రీను మాట్లాడుతూ.. చరిత్రలో ప్రతీ ఉద్యమాన్ని మొదట అందుకున్న సాహిత్యరూపం కవిత్వమని చెప్పారు. ప్రజాస్వామిక, సాయుధ పోరాటాలతో ఎరుపెక్కిన ఓరుగల్లు సాహిత్యంలో శిఖరస్థాయిలో ఉందని, ధిక్కార కవిత్వానికి ఆధ్యులు పోతన, సోమన్న, కాళోజీ, దాశరథి వారసత్వాన్ని నవతరపు కవులు కొనసాగించడం హర్షనీయమన్నారు. కవి సమ్మేళనం నిర్వహించిన బిల్లా మహేందర్ మాట్లాడుతూ.. ఎదుటివాడి గుండెను సూటిగా తాకేది కవిత్వమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కేశిరెడ్డి మాధవి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నేత జగన్మోహన్‌రావు, బండారి రాజకుమారి, కామిడి సతీష్‌రెడ్డి, రమాదేవి, రత్నమాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత్వపఠనం చేసిన కవులకు మెమోంటో, ప్రశంసా పత్రాలను అందజేశారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...