కమనీయం.. కల్యాణం


Fri,March 22, 2019 03:15 AM

దేవరుప్పుల, మార్చి 21: రైతు కుటుంబాల ఇలవేల్పుగా భావించే వానకొండయ్య జాతర గురువారం లక్ష్మీనర్సింహస్వామి కల్యాణంతో ప్రారంభమైంది. కడవెండి శివారులో ఉన్న వానకొండయ్య గుట్టపై వెలిసిన లక్ష్మీనర్సింహస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఏటా కాముని పౌర్ణమి తెల్లవారుజాము నుంచి ఉగాది వరకు జరుగుతాయి. స్వామి వారి కల్యాణం కనులపండువగా జరుగగా.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి ఉష హాజరై శోభాయాత్రలో పాల్గొన్నారు. గుట్టకు రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న కడవెండి నుంచి స్వామి వారి తలంబ్రాలు, పట్టువస్ర్తాలతో వేలాది మంది భక్తులు శోభాయాత్రగా బయల్దేరి లక్ష్మీనర్సింహస్వామికి సమర్పించడం ఆనవాయితీ. ఈసారి మంత్రి సతీమణి ఉష తలంబ్రాలతో శోభాయాత్రలో ఆసాంతం పాల్గొనడం విశేషం. కాగా, ఈ కల్యాణానికి కావాల్సిన పట్టు వస్ర్తాలను అప్పటికప్పుడు పద్మశాలీలు ఈ శోభాయాత్రలో ట్రాక్టర్‌పై అమర్చిన మగ్గంపై నేసి సమర్పించారు.

గుట్ట వద్ద అర్చకులు సంపత్కుమాచార్య, శేషభట్టర్ సాయికిరణ్‌శర్మ, రంగాచార్యులు ఉషాదయాకర్‌రావుతోపాటు పాలకుర్తి దేవస్థాన కమిటీ చైర్మన్ రామచంద్రయ్యశర్మకు పూర్ణకుంభ స్వాగతం పలికి కల్యాణానికి ఆహ్వానించారు. అర్చకుడు బీట్కూరు సంపత్కుమాచార్య నేతృత్వంలో పదుల సంఖ్యలో జంటలు పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని వైభవంగా చేయించాయి. వందలాది మంది భక్తులు గుట్టపైకి వెళ్లి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

గుట్టను అభివృద్ధి చేయాలి
ఇంతటి ప్రాశస్త్యం ఉన్న వానకొండయ్య గుట్టను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఉషాదయాకర్‌రావు అన్నారు. వచ్చే ఏడాది నాటికి కల్యాణ మండపం నిర్మించి గుట్ట కిందే కల్యాణం జరిపించేలా మంత్రి దయాకర్‌రావు చూడాలన్నారు. కల్యాణంలో సర్పంచ్ పోతిరెడ్డి బెత్లినా లీనారెడ్డి, ఎంపీపీ కొల్లూరు సోమయ్య, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ ఈదునూరి నర్సింహరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ తీగల దయాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కారుపోతుల భిక్షపతి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బస్వ మల్లేశ్, యూత్ మండల అధ్యక్షుడు చింత రవి, పొట్టిగుట్ట తండా సర్పంచ్ శంకర్, మండల నాయకులు కోతి పద్మ, సుడిగెల హన్మంతు, కారుపోతుల యాదగిరి, ఉపసర్పంచ్ నగేశ్, నాయకులు తాటిపల్లి మహేశ్, కోల యాదగిరి, రఫేల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పడమటింటి కొమురయ్య, బక్కాజీ, జిట్టె కొమురయ్య, పంతం సోమయ్య, పద్మశాలీలు గుమ్మడవెల్లి శ్రీనివాస్, నల్ల ఉప్పన్న, ఎర్రంరెడ్డి సంజీవరెడ్డి, దరగాని కస్తూరీబాయి పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...