వైభవంగా శ్రీవేణుగోపాలస్వామి ఊరేగింపు


Fri,March 22, 2019 03:14 AM

మడికొండ, మార్చి 21: మడికొండలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో కొనసాగుతున్న స్వామివారి కల్యాణ మహోత్సవాలు గురువారం ముగిశాయి. చివరి రోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజారి వెలగలేటి కృష్ణమాచార్యులు ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన గజవాహనంపై గ్రామ పురవీధుల వెంట స్వామివారి ఊరేగింపు చేపట్టారు. మహిళలు మంగళ హారతులతో స్వామివారికి ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం రాత్రి తొమ్మిది గంటలకు బండ్ల తీర్థం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎడ్లబండ్లు, ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల్లో భక్తులు గుడిచుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఇన్‌స్పెక్టర్ జాన్ నర్సింహులు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 33వ డివిజన్ కార్పొరేటర్ తొట్ల రాజుయాదవ్, ఆలయ కమిటీ అ ధ్యక్షుడు దువ్వ శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు బోగి శ్రీనివాస్, కార్యదర్శి కడార్ల నరేందర్, నాయకులు కొమురయ్య, చరణ్‌రెడ్డి, వినోద్‌కుమార్, వెంకట్‌రావు, జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...