ఘనంగా మంత్రి ఈటల జన్మదిన వేడుకలు


Thu,March 21, 2019 01:16 AM

కమలాపూర్ : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జన్మదినం సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం బుధవారం నిర్వహించారు. ఈటల సేవా సమితి, రూరల్ ఇన్నోవేటివ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో మండలంలోని పలు గ్రామాల నుంచి యువకులు, మహిళలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొని రక్తదానం చేశారు. కార్యకర్యక్రమంలో కమలాపూర్ ఎడ్యూకేషనల్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ ఈటల సమ్మయ్య, ట్రస్టు డైరెక్టర్ దాసి సాంబయ్య, డాక్టర్ సంయుక్త, నిర్వహకులు జి. మొగిలయ్య, మౌటం కుమారస్వామి, కరట్లపల్లి వసంతరావు, గుండెబోయిన మహేశ్, పుల్ల రాజేశ్, నరిగె ఓదెలు, పోరండ్ల రాజు, గోనెల రమేశ్ తదితరులున్నారు.

మండల కేంద్రంలో మంత్రి ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మంత్రి స్వగృహంలో టీఆర్‌ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రి తండ్రి ఈటల మల్లయ్యకేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాట్ల రమేశ్, ఎంపీపీ లక్ష్మణ్‌రావు, జెడ్పీటీసీ నవీన్‌కుమార్, సింగిల్ విండో చైర్మన్ సంపత్‌రావు, సర్పంచ్ కట్కూరి విజయ తిరుపతిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ రమేశ్, నాయకులు బాలసాని కుమారస్వామి, కనుకుంట్ల అరవింద్, పుల్ల శోభన్‌బాబు, జన్ను వేణుగోపాల్, మేకల రవి, కొండం శ్రీనివాస్, పబ్బు సాంబయ్య, మిట్టపల్లి రాజేశం, ఇంద్రసేనారెడ్డి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు మౌటం సంపత్, టీ ఆర్‌ఎస్‌వి నియోజకవర్గ సం యక్త కార్యదర్శి పిల్లి సతీశ్, టీఆర్‌ఎస్‌వి మం డల అధ్యక్షుడు కొల్గూరి రాజ్‌కుమార్, అలీ, భిక్షపతి పాల్గొన్నారు.

ఘనంగా మంత్రి ఈటల జన్మదిన వేడుకలు
ఎల్కతుర్తి : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో బొజ్జ అర్జున్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ కూడలిలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పోరెడ్డి రవీందర్‌రెడ్డి, శ్రీపతి రవీందర్‌గౌడ్, ఎల్తూరి స్వామి, కొమ్మిడి నిరంజన్‌రెడ్డి, డాక్టర్ సంపత్, అల్లకొండ రాజు, మంతుర్తి కొంరయ్య, రాజేశ్వర్‌రావు, మహేందర్, రాజేందర్, కమ్రోద్దీన్, విక్రంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...