ఓటు హక్కును వినియోగించుకోవాలి


Thu,March 21, 2019 01:15 AM

ఐనవోలు మార్చి 20 : ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని డీఆర్‌డీవో డీఆర్‌డీఏ ఎన్నికల నోడల్ ఆఫీసర్ టి రాము అన్నారు. బుధవారం మండలంలోని ఒంటిమామిడిపల్లి, కొండపర్తి గ్రామాల్లో ఏపీఎం కోటేశ్వర్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు, మహిళ సంఘాలకు ఏర్పాటు చేసిన ఓటర్ అవహగాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హా జరై మాట్లాడారు. బీఎల్‌వోలు అందరూ ఓటర్ జాబితాను క్షుణ్ణంగా పరిశీలించిన మిస్సింగ్ ఓట్లను నమోదు చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియంలో ముఖ్యంగా ఓట్లుకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం నాలుగు విభాగాలుగా ఉంటాయి. ఓటుకు సంబంధించిన ఏ సందేహనికైనా టోల్ ఫ్రీ నంబర్ 1950 ఫోన్ చేసిన సందేహాలను తీర్చుకోవచ్చుని పేర్కొన్నారు. ఆదే విధంగా పోలింగ్ విధానం ఈవీవోం, వీవీ ప్యాట్ యంత్రాల పనితీరు పైన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై నర్సింహరావు, సర్పంచులు ఆడెపు దయాకర్, కట్కూరి రాజమణి, డీపీఎం ప్రశాశ్, సీసీలు ఏల్లయ్య, శంకరయ్య, వీఆర్‌వో సదానందం, వీవోఏలు,పాల్గొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...