మూడో రోజు ఒక నామినేషన్


Thu,March 21, 2019 01:15 AM

అర్బన్ కలెక్టరేట్,మార్చి 20: వరంగల్ లోక్‌సభ స్థానానికి మూడో రోజైన బుధవారం ఒక నామినేషన్ దాఖలైంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి మార్త రాజభద్ర య్య నామినేషన్ దాఖ లు చేశారు. సదరు అభ్య ర్థి టబీ-ఫారం ఇవ్వకపోవడంతో 25న సా యంత్రం 3 గంటలలో పు అందజేయాలని ప్రశాంత్‌జీవన్‌పాటిల్ నోటీసు జారీ చేశారు. మొదటి రోజు బీఎస్‌పీ నుంచి బరిగెల శివ, రెండో రోజు ఫిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి పానుగంటి రజితావాణి నామినేషన్ వేశారు. రోజుకు ఒకటి చొప్పున బుధవారం వరకు మొత్తం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే నామినేషన్లు దాఖలు చే సేం టదుకు 22, 25 రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నా యి. శుక్రవారం, చివరి రోజైన సోమవారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలున్నాయి.

మహబూబాబాద్‌లో బోణి..
మహబూబాబాద్:ఎట్టకేలకు మహబూబాబాద్ 16 పార్లమెంట్ నామినేషన్ బోణి కొట్టింది. ఈ నెల 18 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ బుధవారం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీకి చెందిన పార్వతి భూక్య తొలి నామినేషన్ దాఖలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సీతంపేటకు చెందిన పార్వతీ భూక్యని రామారావు, సత్యనారాయణ, వెంకటరమణలు ప్రతిపాదించారు. సాయం త్రం 3.04 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేయడానికి వ చ్చిన లక్ష్మిదేవిపల్లికి చెందిన కోరం వెంకటేశ్వర్లు వెనుతిరిగారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...