కాంగ్రెస్‌లో కబడ్డీ కబడ్డీ!


Wed,March 20, 2019 03:05 AM

-వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య ఎంపికపై భిన్నస్వరాలు
-మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని సాంబయ్యకు ఎట్లా ఇస్తారని ఆవేదన
-అందరినీ ప్రసన్నం చేసుకునేందుకు దొమ్మాటి ప్రయత్నాలు
-ఎట్లుంటదో చూడాలంటున్న పార్టీ శ్రేణులు
వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: విస్తృత ప్రజాసేవే లక్ష్యంగా, పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన దొమ్మాటి సాంబయ్య 2004లో పరకాల నియోజకర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమం ప్రభావం, టీడీపీ అప్పట్లో తెలంగాణపై అనుసరించిన విధానంతో ఘోర పరాజయాన్ని చవిచూశారు. 2009 ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్, టీడీపీ, ఉభయ క మ్యూనిస్టు పార్టీలతో ఏర్పాటైన మహాకూటమి పొత్తు ధర్మాన్ని చెరిపేసిన టీడీపీ నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా దొమ్మాటిని బరిలో దింపిందన్న అపవాదును మూటగట్టుకున్నది. టీడీపీ బీ-ఫాంపై బరిలో నిలిచిన దొమ్మాటి సాంబయ్యకు లక్షా 35వేల ఓట్లు వచ్చాయి. ఇదే పార్టీ నుంచి ఆయన స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకర్గం నుంచి 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అనంతర రాజకీయ పరిణామాలతో ఆయన వైఎస్సార్‌సీపీలో పనిచేశారు. తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరా రు. అక్కడి నుంచి తిరిగి మూడునెలల క్రితం కాంగ్రెస్ జాతీ య అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీ వర్కింగ్ ప్రె సిడెంట్ రేవంత్‌రెడ్డి గ్రూపులో ఉన్నారు.

కాంగ్రెస్‌లో తాజా ముసలం
వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా దొమ్మాటి సాంబయ్యను అధికారికంగా ఏఐసీసీ ప్రకటించగానే అనంతర పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అసలే కాంగ్రెస్.. ఆపై గ్రూపు రా జకీయాలకు పెట్టింది పేరు అన్న ముద్ర పడ్డ నేపథ్యంలో సాంబయ్య కు సహకారం ఏ స్థాయిలో ఉంటుందన్న చర్చ సాగుతున్న ది. మొదటి నుంచి పనిచేసి న వారిని కాదని అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే పార్టీలో చేరిన వారిని పార్టీ ఆదరిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. మొదటి నుంచి పనిచేసి, టికెట్ ఆశించినవారికి భంగపాటే ఎదురైందన్న నైరాశ్యం నెలకొన్నది. సుదీర్ఘ కాలం పాటు, పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఎన్నికల వేళ పారా చూట్‌లో దిగిన వారికి, సూట్‌కేసులతో దిగినవారికి టికెట్లు ఇ వ్వం అని ప్రకటించిన తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధే కొత్తగా వచ్చిన వారికి టికె ట్లు ఇస్తున్నారని, ఇలాంటి సందర్భంలో పార్టీలో ఎలా కొనసాగేదనే నైరాశ్యం వ్యక్తమవుతున్నది. టికెట్ల కోసం పార్టీలు మా రిన వారిని ప్రజలు ఎలా ఆదరిస్తారని వారు పరోక్షంగా దొమ్మాటి సాంబయ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారనే చర్చ సాగుతుందట. కాంగ్రెస్ అం టే సముద్రం. ఇందులోకి ఎవరైనా రావచ్చు.

మొదటి నుంచి కష్టపడ్డవాళ్లకు విలువ ఉండదు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డబ్బులున్నవాళ్లకే టికెట్లు ఇస్తారని ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ హోటల్‌లో బాజాప్తా ప్రకటించారు. అ ప్పటి నుంచే పార్టీపై, పార్టీలో పైస్థాయిలో ఉన్న నాయకులపై నమ్మకం పో యింది అని టికెట్ ఆశించి భంగపడ్డ ఓ సీనియర్ నాయకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వరంగల్ ఎంపీ టికెట్‌ను కాంగ్రెస్ నుంచి ఆశించిన వారెందరో ఉన్నారు. అందరినీ కాదని దొమ్మాటిని ఎట్లా ప్రకటిస్తారు అని పార్టీ అధిష్టానం తీరుపై పలువురు విమర్శలు చేస్తున్నారు. పార్టీ బ్లాక్ స్థాయి నుంచి నియోజకవర్గం, జిల్లా స్థాయిలో కనీసం చర్చించకుండా, పార్టీలో ఎవరినీ సంప్రదించకుండా ఏ కపక్షంగా, అదీ అనేక పార్టీలు మారిన వ్యక్తిని అభ్యర్థిగా ఎట్లా ప్రకటిస్తారని టికెట్ ఆశించిన వాళ్లు మండిపడుతున్నారట. ఇదే స్థానం మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, అద్దంకి దయాకర్, నమిండ్ల శ్రీనివాస్, డాక్టర్ విజయ్‌కుమార్, ఇంది రా, బక్క జడ్సన్, పసుల యాకస్వామి సహా అనేక మంది ప్రయత్నాలు చేశారు. ఎవరికి తోచిన మార్గాల్లో వారు పార్టీ అధిష్టానానికి తమ అభ్యర్థిత్వాలు పరిశీలించాలని వేడుకున్నారు. వీరిలో సాంబయ్య రేవంత్‌రెడ్డి వర్గం అని, అందుకే కలిసి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి.

ఆటగాడి ముందు అనేక సవాళ్లు
దొమ్మాటి సాంబయ్యకు కబడ్డీ ఆటగాడిగా మంచి పేరుంది. పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా చేసిన అనుభవం ఉంది. అయితే ఇద్దరు వ్యక్తులు నాలుగు గ్రూపులుగా చెలామణి అయ్యే కాంగ్రెస్‌లో ఎలా నెట్టుకురాగలరు? అసలే అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ దూకుడుగా ఉంది. ప్రజల్లో ఆ పార్టీకి విశేష ప్రజాభిమానం ఉంది. సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో క్రేజీ ఉంది. ఇవన్నీ తట్టుకొని కాంగ్రెస్ పార్టీ బరిలో ఏ మేరకు పోటీ ఇవ్వగలదు? అన్న ఆసక్తికర చర్చ సాగుతున్నది. ఆయన మంచి ఆటగాడే. కబడ్డీ.. కబడ్డీ అంటూ పిచ్‌లో చిచ్చరపిడుగులా ఆడేవారు. కానీ, ఇవి రాజకీయాలు, పైగా ఆయనకు అనేక పార్టీలు మారిన నేపథ్యం ఉంది. అవి ఆయనకు లాభం తెస్తాయా? అసలు వాటితోనే నష్టం జరుగుతుందా అన్న విషయాలు పక్కనపెడతే అసలాయనకు పార్టీలో ఎంత మంది సహకరిస్తారు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

అందరి మద్దతు కోరిన తర్వాతే..
దొమ్మాటి సాంబయ్య తన అభ్యర్థిత్వం ఖరారు కాగానే పార్టీలో అందరి మద్దతును కూడగట్టేందుకు రంగంలోకి దిగా రు. పార్టీ అధిష్టానం తనను అభ్యర్థిగా ప్రకటించింది. సహకరించండీ అంటూ కోరుతున్నారు. కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయన కొత్త. అభ్యర్థులు ఎవరైనా అ ప్పటి దాకా అభ్యర్థి వెంటే ఉంటారు కానీ ఎన్నికలు తెల్లారి అన గా పార్టీ ఫిరాయించే, ఆ పార్టీ అభ్యర్థికి సహాయ నిరాకరణ చేసే స్వభావం మెండుగా ఉంటుంది. అలాంటి పార్టీలో తను ఎలా నెట్టుకోస్తాడన్నది ఆసక్తిగా మారింది. అసలే టీఆర్‌ఎస్ ప్రభంజ నం ఉన్నది. వీటిని తట్టుకొని నిలబడటం అసాధ్యం అన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేతలే వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఉన్న అసమ్మతి, సహాయ నిరాకరణ, తన అభ్యర్థిత్వంపై నిరసన వ్య క్తం చేస్తున్న గ్రూపులను సమన్వయం చేసుకోవడం సులువైన పనికాదనే అభిప్రాయాలున్నాయి. తనను అభ్యర్థిగా ప్రకటించిన నే పథ్యంలో ఆయన పార్టీ ముఖ్యనేతల్ని మంగళవారం కలిసి తనకు సహకరించాలని వేడుకున్నారు.

వరంగల్ పార్లమెంట్ పరిధిలోని వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకర్గాలు ఎస్సీ రిజర్వ్ కాగా మిగిలిన ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు జనరల్ స్థానాలు. పార్టీ అర్బన్, రూరల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రా జేందర్‌రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, పార్టీ నాయకులు నమిండ్ల శ్రీనివాస్‌ను ఆయనమంగళవారం కలిశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి పోటీచేసి ఇందిరను కలిసేందుకు ప్రయత్నించగా ఆమె నిరాకరించారని ప్రచారం సాగుతున్నది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. పరకాల ఇన్‌చార్జి కొండా సురేఖ అందుబాటులో లేక కలువలేకపోయారని చెప్పారు. ఏడు అ సెంబ్లీ నియోకవర్గాల్లో ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ పార్టీ నుంచి బరిలో నిలవడంపై దొమ్మాటి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు తనతో కలిసి వస్తారనే భరోసా ఉన్నారు. కానీ, అసలు టైమ్‌లో చేయిచ్చేవారే ఆ పార్టీలో ఎక్కువ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

123
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...