110 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత


Wed,March 20, 2019 03:03 AM

ఖిలావరంగల్, మార్చి19: ప్రభుత్వం ప్రజలకు స రఫరా చేస్తున్న నిత్యావసర సరుకులు దారి మళ్లకుం డా పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం నల్ల బజారుకు చేరకుండా దందాకు చెక్ పెడుతున్నారు. ఇటీవల మి ల్స్‌కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్‌ఆర్‌ఆర్ తో టలో గుట్కాల కోసం వెళ్లిన పోలీసులకు రేషన్ బి య్యం పట్టుబడ్డాయి. తాజాగా సోమవారం తెల్లవా రు జామున అదే ప్రాంతం నుంచి లారీ, బొలెరో వా హనం ద్వారా తరలిస్తున్న 110క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని మిల్స్‌కాలనీ పోలీసులు స్వాధీనం చేసుకొని బాధ్యులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో వరంగల్ ఏసీపీ నర్స య్య వివరాలను వెల్లడించారు. ఎస్‌ఆర్‌ఆర్ తోటలో పీడీఎస్ బియ్యాన్ని ఒక లారీ, బొలెరో వాహనం ద్వా రా అక్రమంగా తరలిస్తున్నారని స్థానికుల ద్వారా స మాచారం అందిందన్నారు.

దీంతో మిల్స్‌కాలనీ సీఐ సత్యనారాయణ, ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలి సి లారీలో బియ్యం లోడుచేస్తున్న ప్రదేశానికి వెళ్లా రు. అక్కడున్న లారీలోకి బొలెరో వాహనం ద్వారా వివిధ ప్రాంతాల నుంచి పీడీఎస్ బియ్యాన్ని తీసుకువచ్చి లోడ్‌చేస్తున్నారు. అక్రమంగా బియ్యం రవాణా చేస్తున్న శివనగర్‌కు చెందిన వేణు, లారీ డ్రైవర్ తాం డ్ర బాబును అదుపులోకి తీసుకున్నట్లు వివరించా రు. రెండు వాహనాలతోపాటు బియ్యాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి సీజ్‌చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పీడీఎస్ బియ్యాన్ని మహారాష్ట్రకు రవాణా చే స్తున్న హన్మకొండకు చెందిన ముధశీర్ అనే వ్యక్తి ప రారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ ముగ్గురు నిందితులు రేషన్‌బియ్యాన్ని కిలోకు రూ.11చొప్పున కొనుగోలు చేసి మహారాష్ట్రలో రూ.30కి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. పరారీలో ఉన్న మురళీధర్‌ను త్వరలోనే ఆరెస్టు చేస్తామన్నారు. పేదలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని నల్ల బజారుకు తరలిస్తున్నట్లు తెలిస్తే 100కు డయల్ చేయాలని ఏసీపీ నర్సయ్య కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సైలు రవీందర్, వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...