మార్కెట్ కమిటీ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం


Wed,March 20, 2019 03:03 AM

కాశీబుగ్గ, మార్చి19: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని అగ్నిమాపక కేం ద్రంలో విధులు నిర్వహించే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. లేబర్‌కాలనీ గరీబ్‌నగర్‌కు చెందిన పత్తిపాక నాగరాజు ఐదేళ్లుగా మార్కెట్ పరిధిలోని పత్తి, మిర్చి యార్డులో ఫైర్‌సెఫ్టీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నా డు. ఈ విభాగంలో ఐదుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి అక్కడ సరైన పనిలేకపోవడంతో మార్కెట్ ప్రధా న కార్యాలయంలోని డిమాండ్ సెక్షన్‌లో విధులు కేటాయించారు. కాగా, వేసవి కావడంతో మిర్చియార్డులో వాటర్ ఫైర్‌ఫైట్స్ నిర్వహించాలని గతంలో కార్యదర్శి వారిని అదేశించారు. ఈ క్రమంలో మిర్చియార్డులో ఏర్పాటు చేసిన ఫైర్ పైపులైన్లు చెడిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. వెంటనే అధికారు ల అదేశానుసారం మరమ్మతులు చేపట్టాడు. రోజువారీగా డిమాండ్ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న పత్తిపాక నాగరాజు మంగళవారం మార్కెట్ ప్రధాన కార్యాలయానికి వచ్చి సంతకం చేసి ఇంటికి వెళ్లి కెమికల్‌ను తాగి తన భార్యకు ఫోన్‌ద్వారా సమాచారం అందించినట్లు తెలిపారు. బాధితుడిని స్థానికులు ఎంజీఎంకు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. మార్కెట్ అధికారుల వేధింపులతోనే తన కుమారుడు ఈ ఘటనకు పాల్పడ్డాడని బాధితుడి తండ్రి కేదారి ఆరోపించారు. ఈ సందర్భంగా మార్కెట్ కార్యదర్శి సంగయ్య మాట్లాడుతూ.. తాము మార్కెట్‌లో విధులు నిర్వహించే సిబ్బందిని పనిచేయమని అదేశింస్తాంగానీ ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని తెలిపారు. త మపై వస్తున్న ఆరోపనలు అవాస్తవం అని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే జేడీఎం మల్లేశం, కార్యదర్శి సంగయ్య, గ్రేడ్-2 కార్యదర్శులు చింతలపెల్లి రాంమోహన్‌రెడ్డి, పాల జగన్‌మోహన్, ఇతర సిబ్బంది బాధితుడిని పరామర్శించారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...